ఈ హీరో అకౌంట్‌లోకి మరో డిజాస్టర్..!

Sun 21st Jul 2019 07:30 PM
vikram,mister kk,failed,box office,aame movie  ఈ హీరో అకౌంట్‌లోకి మరో డిజాస్టర్..!
Vikram Mister KK Failed at Box Office ఈ హీరో అకౌంట్‌లోకి మరో డిజాస్టర్..!
Sponsored links

విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ తమిళ నటుడు చియాన్ విక్రమ్. ఏ కేరెక్టర్ అయినా అవలీలగా చెయ్యగల నటుడు. గతంలో విక్రమ్ సినిమా అంటే ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ పిచ్చ క్రేజ్. కానీ గత కొన్నేళ్లుగా విక్రమ్ సినిమా అంటే బోర్.. అన్న రేంజ్‌లో ఉంటున్నాయి విక్రమ్ సినిమాలు. పూర్తి కమర్షియల్ చిత్రాలకే విక్రమ్ సొంతమయ్యాడు. ఆ చిత్రాలకు రొటీన్ కి భిన్నంగా లేకుండా పూర్తి రొటీన్ చిత్రాలు కావడంతో వరసగా డిజాస్టర్స్ అవుతున్నాయి. అయినా విక్రమ్ నుండి సినిమాలు మాత్రం ఆగడం లేదు. ఏడాదికో సినిమా లెక్క ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. తాజాగా విక్రమ్ ఖాతాలో మరో డిజాస్టర్ వచ్చి చేరింది.

మిస్టర్ కేకే అంటూ విక్రమ్ ట్రైలర్ తో చేసిన హడావిడి చూసిన వారికీ ఈసారి విక్రమ్ ఎలాగైనా హిట్ కొడతాడనుకున్నారు. కానీ సినిమాలో కథ, కథనం బలహీనంగా ఉండడంతో సినిమాకి ప్లాప్ టాక్ పడింది. మిస్టర్ కేకే గా విక్రమ్ కొత్తగా.. న్యూ లుక్ లోను కనిపించాడు. ఇక సినిమాలో విక్రమ్ లుక్ గాని, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ గాని, స్టైలిష్ టేకింగ్ గాని తప్పితే మిస్టర్ కేకే గురించి చెప్పుకోవడానికి ఏం కనిపించలేదు. 

అసలు విక్రమ్ కథల ఎంపికలో లోపం ఉందో... ఆయనతో సినిమాలు చేసే దర్శకుల్లో లోపం ఉందో అనేది విక్రమ్‌కే తెలియాలి. ఇక తమిళనాట భారీ ప్రమోషన్స్ చేసి మిస్టర్ కేకే కి తెలుగులో పూర్ ప్రమోషన్స్‌తో విడుదలకావడంతో ఆ సినిమా థియేటర్స్ లోకి ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. ఈ శుక్రవారం విడుదలైన మిస్టర్ కేకే కి అమలా పాల్ ‘ఆమె’ సినిమా అటు తమిళ్ లోను ఇటు తెలుగులోనూ ఝలక్ ఇచ్చింది. అమలా పాల్ ‘ఆమె’ సినిమాకి హిట్ టాక్ పడడంతో మిస్టర్ కేకే మాటల్లో కూడా లేకుండా పోయింది.

Sponsored links

Vikram Mister KK Failed at Box Office:

Aame Beats Mister KK at Box Office

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019