సాయిపల్లవే గ్రేట్ అంటున్న రష్మికా మందన్న!

Rashmika Mandanna About Sai Pallavi

Sun 21st Jul 2019 07:28 PM
rashmika mandanna,praises,sai pallavi,dear comrade,promotions  సాయిపల్లవే గ్రేట్ అంటున్న రష్మికా మందన్న!
Rashmika Mandanna About Sai Pallavi సాయిపల్లవే గ్రేట్ అంటున్న రష్మికా మందన్న!
Advertisement

‘ఛలో’తో సాలిడ్ హిట్ కొట్టి... గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కన్నడ భామ రష్మిక మందన్న.. దేవదాస్ సినిమాతో ప్లాప్ అందుకుంది. అయినా గీత గోవిందంలో తనతో కలిసి నటించిన విజయ్ దేవరకొండ మళ్లీ రష్మిక తోనే డియర్ కామ్రేడ్ చేసాడు. ముందు డియర్ కామ్రేడ్ సినిమా కోసం సాయి పల్లవిని అనుకున్నప్పటికీ.... ఆమె లిప్ లాక్ సన్నివేశాలకు నో చెప్పడంతో.. ఆ ప్లేస్ లోకి గీత గోవిందం భామ రష్మిక వచ్చింది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ లో రష్మిక, విజయ్ దేవరకొండ తో కలిసి బిజీగా వుంది.

సాయి పల్లవి గ్లామర్ అండ్ లిప్ లాక్ సన్నివేశాలకు దూరం గనుకనే ఆమె కి స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ రావడం లేదు. ఇప్పటికే ఫిదా, కణం, ఎంసీఏ సినిమాల్తో పాటుగా పడి పడి లేచే మనసు సినిమాతోనూ బాగా ఆకట్టుకున్న సాయి పల్లవితో ప్రస్తుతం రెండు మూడు హిట్స్ తో రష్మిక కూడా పోటీ పడుతుంది. ఇద్దరూ అటు ఇటుగా ఒకేసారి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు కూడా. 

అయితే సాయి పల్లవి కాదన్న కేరెక్టర్ ని రష్మిక చెయ్యడం, సాయి పల్లవి కి మీరు గట్టి పోటీ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది అని డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ లో రష్మిక కి ఓ ప్రశ్న ఎదురు కాగా... ఒక నటిగా, నటనలో సాయి పల్లవి నాకన్నా ఓ మెట్టు పైనే ఉంటుందని చెప్పింది. మరి సాయి పల్లవి ఫేస్ ఎక్సప్రెషన్స్, ఆమె డాన్స్ ముందు నిజంగానే రష్మిక దిగదుడుపే. అయినా ప్రస్తుతం సాయి పల్లవి కన్నా ఎక్కువ క్రేజ్ ఉన్న రష్మిక... సాయి పల్లవి తనకన్నా పైనే ఉంటుందని చెప్పి అభిమానుల మనసులను గెలుచుకుంది. 

Rashmika Mandanna About Sai Pallavi:

Rashmika Mandanna Praises Sai Pallavi at Dear Comrade Promotions


Loading..
Loading..
Loading..
advertisement