రాముడిగా ఎన్టీఆర్ అయితే బెటరంట!

Mon 15th Jul 2019 04:54 AM
jr ntr,allu aravind,ramayan,lord rama role  రాముడిగా ఎన్టీఆర్ అయితే బెటరంట!
Jr NTR Name for Allu Aravind Ramayan రాముడిగా ఎన్టీఆర్ అయితే బెటరంట!
Sponsored links

అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా కలిసి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’. దాదాపు 1500 కోట్లుతో ఈసినిమా తెరకెక్కుతుంది. హిందీ డైరెక్టర్ నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ ఈ భారీ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయనున్నారు. ఇది మొత్తంగా మూడు భాగాలుగా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.

మొదటి భాగం 2021 లో రిలీజ్ చేయనున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల నుండి నటీనటుల్ని తీసుకుంటున్నారు. మరి రాముడు పాత్ర ఎవరు చేస్తారు అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే రాముడి పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ బాగుంటాడని.. తారక్ అయితేనే ఆ పాత్రకు న్యాయం చేస్తాడు అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరి ఇది తారక్ దాకా వెళ్లిందో లేదు తెలియదు కానీ ఇండియా మొత్తం చాలా మంది హీరోస్ ఉన్నా ఒక్క టాక్ పేరు గుర్తుకురావడం నిజంగా విశేషమే. పైగా తారక్ కు పౌరాణిక చిత్రాలు అంటే ఇష్టం.. పైగా తారక్ ది డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటది కాబట్టి తారక్ అయితే బెటర్ అంటున్నారు. ఒకవేళ తారక్ ను నిజంగానే తీసుకుంటే ఫ్యాన్స్ కు అంతకు మించి ఏం కావాలి?

Sponsored links

Jr NTR Name for Allu Aravind Ramayan:

Ramayan Movie goes Trending

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019