రాజుగాడు రెండో సినిమాకి రెడీ..!

Mon 15th Jul 2019 04:02 AM
anand deverakonda,second film,details  రాజుగాడు రెండో సినిమాకి రెడీ..!
Anand Deverakonda Second Film Details రాజుగాడు రెండో సినిమాకి రెడీ..!
Sponsored links

మొదటి సినిమా దొరసాని రిజల్ట్ కొంచెం అటుఇటుగా ఉన్నా ఓవరాల్ గా పాస్ అయిపోయిందనే చెప్పాలి. సినిమా రిజల్ట్ పక్కన పెడితే హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ గురించి నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కుర్రోడు ఇంకొంచెం ట్రైనింగ్ తీసుకుని వస్తే బెటర్ అని కామెంట్స్ వస్తున్నాయి. అయితే అవి ఏమి పటించుకోకుండా మనోడు తన నెక్స్ట్ సినిమాని కూడా స్టార్ట్ చేసేస్తున్నాడు.

కొత్త దర్శకుడు వినోద్ అనే వ్యక్తితో తన రెండో సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశముంది. అయితే రెండో సినిమా మాత్రం పూర్తిస్థాయి కమర్షియల్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకున్నారు. ఇది లవ్, కామెడీ, రొమాన్స్ లాంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కబోతుందని తెలుస్తుంది.

ఇక ఈమూవీని ప్రముఖ నిర్మాత ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అన్నీ కుదిరితే ఈనెలలోనే ఈసినిమా ఓపెనింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ కొత్త దర్శకుడు వినోద్ మొదట ఈ కథను విజయ్ దేవరకొండకి అనుకున్నాడు. కానీ విజయ్ తనకంటే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండకు బాగుంటదని విజయ్ అటువైపు మళ్లించాడట.

Sponsored links

Anand Deverakonda Second Film Details:

Dorasani Hero Ready to Second Film

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019