తెలుగు బిగ్‌బాస్‌-3 గురించి షాకింగ్ న్యూస్!

Fri 12th Jul 2019 08:10 PM
swetha reddy,bigg boss,season 3,casting couch,actress swetha reddy  తెలుగు బిగ్‌బాస్‌-3 గురించి షాకింగ్ న్యూస్!
Shocking News about Telugu Bigg Boss Season 3 తెలుగు బిగ్‌బాస్‌-3 గురించి షాకింగ్ న్యూస్!
Sponsored links

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ అప్పట్లో పెద్ద హంగామానే జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ వ్యవహారం టాలీవుడ్ నుంచి వయా బాలీవుడ్‌.. హాలీవుడ్ వరకు పాకింది. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారం మీద వివాదాస్పద నటిగా పేరుగాంచిన శ్రీరెడ్డి పేరే ఎక్కువగా వినిపించింది. అయితే తాజాగా మరోసారి ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం వెలుగుచూసింది.

తెలుగులో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో.. త్వరలోనే మూడో సీజన్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఈ షోకు వ్యాఖ్యాతగా టాలీవుడ్ మన్మథుడు, అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల చివర్లో షో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇంత వరకూ కంటెస్టెంట్లు ఎవరన్న విషయం తెలియరాలేదు. మరోవైపు పలువుర్ని సెలెక్ట్ చేసే వ్యవహారంలో ఈ షో గురించి షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది.

తెలుగు బిగ్‌బాస్‌-3 ప్రారంభం కాకమునుపే క్యాస్టింగ్ కౌచ్ అంటూ ప్రముఖ యూట్యూబ్ యాంకర్ శ్వేతా రెడ్డి సంచలనం రేపింది. ఇటీవల ఓ చానెల్‌ డిబెట్‌లో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.  ‘నాకు ఓ కో ఆర్డినేటర్ కాల్ చేసి.. మా బాస్‌ను ఎలా ఇంప్రెస్స్ చేస్తారు అని అడిగారు.. అంటే ఏంటి..? కమిట్మెంట్ అడుగుతున్నారా అని నేను కోపంగా అడిగాను.. అంతే  ఆ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ కాల్ రాలేదు’ అని శ్వేతా రెడ్డి చెబుతోంది. అయితే ఇందులో నిజానిజాలెంత..? హడావుడి చేయడానికే ఇలా చెబుతున్నారా అనేది పైనున్న పెరుమాళ్లకే ఎరుక.

Sponsored links

Shocking News about Telugu Bigg Boss Season 3:

Swetha Reddy Allegations for Bigg Boss Entry

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019