‘ఉండిపోరాదే’కు వివి వినాయక్ సపోర్ట్

Fri 12th Jul 2019 08:01 PM
vv vinayak,undiporade,movie song,release  ‘ఉండిపోరాదే’కు వివి వినాయక్ సపోర్ట్
VV Vinayak Launches Undiporade Movie song ‘ఉండిపోరాదే’కు వివి వినాయక్ సపోర్ట్
Sponsored links

ఉండిపోరాదే సాంగ్ రిలీజ్ చేసిన  డైరెక్టర్ వి వి వినాయక్ 

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉండిపోరాదే’. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా  ప్రస్తుతం ఈ చిత్రంలోని సాంగ్ ను ప్రముఖ దర్శకుడు వి. వి వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా..

డేరింగ్ డైరెక్టర్ వి వి వినాయక్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా టైటిల్ ఉండి పోరాదే చాలా బాగుంది. అలాగే సాబు వర్గీస్ సంగీత సారధ్యంలో రూపొందిన సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. దర్శక నిర్మాతలకు అభినందనలు. సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు.

నిర్మాత డా. కె లింగేశ్వర్ మాట్లాడుతూ - ‘‘మా చిత్ర టీజర్ కి  ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు వి వి వినాయక్ గారు మా సాంగ్ రిలీజ్ చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు.  మా చిత్రం మంచి ప్రమాణాలతో తెరకెక్కింది. యూత్ తో పాటు అన్ని వర్గాల వారికి తప్పకుండా నచ్చుతుంది. త్వరలో  రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము’’ అన్నారు.

దర్శకుడు నవీన్ నాయని మాట్లాడుతూ - ‘‘వినాయక్ గారికి కృతజ్ఞతలు. మంచి కంటెంట్ తో పాటు సందేశాత్మక చిత్రంగా ఉండి పోరాదే తెరకెక్కింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు మ్యూజిక్ బాగా కుదిరింది. సాబు వర్గీస్ అధ్బుతమైన మ్యూజిక్ తో పాటు  మహావీర్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. లిరిక్స్ కూడా బాగున్నాయి. సినిమా తప్పకుండా గణ విజయం సాధిస్తుంది’’ అన్నారు.

సినిమాటోగ్రాఫర్: శ్రీనివాస్ విన్నకోట, మాటలు: సుబ్బారాయుడు బొంపెం, ఎడిటర్: జె.పి, ఫైట్స్: రామ్ సుంకర, నబ, సుబ్బు, మ్యూజిక్ : సాబు వర్గీస్, ఆర్ ఆర్: యెలెందర్ మహావీర్, నిర్మాత : డా. కె. లింగేశ్వర్: స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నవీన్ నాయని.

Sponsored links

VV Vinayak Launches Undiporade Movie song:

Undiporade Movie Song Released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019