ట్రెండింగ్‌లో కౌసల్య కృష్ణమూర్తి ఫస్ట్‌ సాంగ్‌!

Wed 26th Jun 2019 10:01 AM
kousalya krishnamurti,movie,muddabanti song,tending  ట్రెండింగ్‌లో కౌసల్య కృష్ణమూర్తి ఫస్ట్‌ సాంగ్‌!
Kousalya Krishnamurti First Song Released ట్రెండింగ్‌లో కౌసల్య కృష్ణమూర్తి ఫస్ట్‌ సాంగ్‌!
Sponsored links

ట్రెండింగ్‌లోకి వచ్చిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ ఫస్ట్‌ సాంగ్‌ ‘ముద్దాబంతి పూవు’ 

‘ముద్దాబంతి పూవు ఇలా పైట వేసెనా.. ముద్దూ ముద్దూ చూపులతో గుండె కోసెనా...’ అంటూ యాజిన్‌ నిజార్‌ పాడిన ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’ చిత్రంలోని పాట ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ చిత్రంలోని పాటను రేడియో మిర్చిలో విడుదల చేశారు. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ పాటకు దిబు నినన్‌ థామస్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమా తమిళ మాతృక అయిన ‘కణ’ చిత్రంలోని ‘ఒతాయాడి పాదయిలా...’ పాట వరల్డ్‌వైడ్‌గా చాలా పెద్ద హిట్‌ అయ్యింది. యూ ట్యూబ్‌లో 67 మిలియన్‌ వ్యూస్‌ని క్రాస్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’ చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని మొదటి పాట విడుదలైన సందర్భంగా... 

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘ఈ పాట తమిళ్‌లో చాలా పెద్ద హిట్‌ అయింది. వరల్డ్‌వైడ్‌గా 67 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. ఆ పాటను ఈరోజు విడుదల చేశాం. తెలుగులో కూడా ఈ పాట చాలా మంచి రెస్పాన్స్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చింది. మ్యూజికల్‌గా ఈ పాట సినిమాకి పెద్ద హైలెట్ అవుతుంది’’ అన్నారు. 

క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ.. ‘‘తమిళ్‌లో ఈ సినిమాకు దిబు థామస్‌ చేసిన మ్యూజిక్‌ చాలా పెద్ద హిట్‌ అయ్యింది. తెలుగులో కూడా అదే రేంజ్‌లో హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను జూలై 2న గ్రాండ్‌గా నిర్వహించబోతున్నాం. ఈ ఫంక్షన్‌కు ఇండియన్‌ విమెన్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ అతిథిగా హాజరవుతున్నారు’’ అన్నారు. 

హీరో కార్తీక్‌రాజు మాట్లాడుతూ.. ‘‘క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో నటించాలన్నది నా డ్రీమ్‌. అది ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను, ఐశ్వర్యా నటించిన ‘ముద్దబంతి..’ పాటతో మ్యూజిక్‌ లాంచ్‌ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నాను’’ అన్నారు. 

నిర్మాత కె.ఎ.వల్లభ మాట్లాడుతూ.. ‘‘షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. జూలై రెండో వారంలో ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. 

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌(స్పెషల్‌ రోల్‌), కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, వెన్నెల కిశోర్‌, ‘రంగస్థలం’ మహేశ్‌, విష్ణు(టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్‌, కథ: అరుణ్‌రాజ కామరాజ్‌, మాటలు: హనుమాన్‌ చౌదరి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, క ష్ణకాంత్‌(కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌, డాన్స్‌: శేఖర్‌, భాను, ఆర్ట్‌: ఎస్‌.శివయ్య, కో-డైరెక్టర్‌: బి.సుబ్బారావు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.వి.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.

Sponsored links

Kousalya Krishnamurti First Song Released:

Kousalya Krishnamurti Movie Muddabanti Song in Tending

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019