సాహో కేక.. మరి సై రా సంగతేంటో?

Wed 26th Jun 2019 09:51 AM
prabhas,saaho,teaser,chiranjeevi,trailer,waiting,fans  సాహో కేక.. మరి సై రా సంగతేంటో?
Saaho Teaser Released.. Waiting for Sye Raa సాహో కేక.. మరి సై రా సంగతేంటో?
Sponsored links

ప్రభాస్ - సుజిత్ కాంబోలో రాబోతున్న సాహో సినిమా షూటింగ్ కంప్లీట్ అవడమే కాదు.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యింది. అలాగే సాంగ్ షూట్ తో పాటుగా ఇండియా వైడ్ గా పబ్లిసిటీ కి ప్లాన్ చేసింది సాహో టీం. సాహో సినిమా ఇండియా వైడ్ గా తెరకెక్కుతుంది అంటే... ప్రేక్షకుల అంచనాలు అందుకోగలదా అనే డౌట్ ని సాహో టీజర్ తుడిచేసింది. ప్రభాస్ స్టయిల్, యాక్షన్ సన్నివేశాలు, శ్రద్ధా కపూర్ లుక్స్, భారీ తనం ఉట్టిపడడం అన్ని వెరసి సాహో టీజర్ క్షణాల్లో వైరల్ అయ్యింది. మరి భారీ బడ్జెట్ మూవీగా సాహో ప్రస్తుతం అన్ని భాషల ప్రేక్షకులు ఎదురు చూసేలా సాహో టీజర్ చెయ్యగలిగింది.

తాజాగా మరో భారీ బడ్జెట్ మూవీ సై రా నరసింహరెడ్డి కూడా విడుదలకు సిద్దమవుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సై రా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యింది. షూటింగ్ చివరి రోజున మెగాస్టార్ చిరు జర్నలిస్ట్ లు, ఫోటో గ్రాఫర్స్ తో తన సై రా గెటప్ తో ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చేసాడు. ఇక సై రా లుక్ నుండి రివీల్ అయిన చిరు ఇప్పుడు తన పాత్రకి డబ్బింగ్ చెబుతున్నాడు. ఇక సై రా ట్రైలర్ కూడా ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. మరి కళ్ళు మిరిమిట్లు గొలిపే సెట్టింగ్స్, భారీ యుద్ధ సన్నివేశాలు, చిరు సై రా లుక్, హీరోయిన్స్ అందాలు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ లుక్ అన్ని సై రా కి ప్రధాన ఆకర్షణ కాబోతున్నాయి. 

మరి సై రా ట్రైలర్ కోసం ఎడిటర్స్ ప్రత్యేకంగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. మరా ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ ప్రేక్షకులు నచ్చేదిగా ఉండాలంటే ఆ మాత్రం కష్టపడాల్సిందే. ఇక సాహో అందరిని మెస్మరైజ్ చేసి.... సినిమా మీద అందరిలో ఇంట్రెస్ట్ కలుగజేసింది. ఇక ఇప్పుడు సై రా వంతు.

Sponsored links

Saaho Teaser Released.. Waiting for Sye Raa:

Sye Raa Trailer Release on Chiru Birthday

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019