సాహో టీజర్ రివ్యూ!!

Fri 14th Jun 2019 11:22 PM
saaho teaser,action packed,prabhas  సాహో టీజర్ రివ్యూ!!
Saaho Teaser Review Talk సాహో టీజర్ రివ్యూ!!
Sponsored links

ప్రభాస్ తాజా చిత్రం సాహో హడావిడి మొదలైపోయింది. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ మూడు భాషల్లో భారీగా  తెరకెక్కిస్తున్న సాహో సినిమా ఆగష్టు 15 విడుదలకు సిద్ధమవుతుండగా.. రెండు నెలల ముందు నుండే సాహో ప్రమోషన్స్ ని ఇంటర్నేషనల్ స్థాయిలో మొదలెట్టేసింది సాహో టీం. యాక్షన్ ప్రధానాంశముగా తెరకెక్కుతున్న సాహో చిత్రం అటు హిందీ లోను భారీ అంచనాలను మూటగట్టుకుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీగా తెరకెక్కిన సాహో చిత్ర టీజర్ ని ఈరోజు జూన్ 13 న విడుదల చేస్తున్నామని ప్రకరటించన నాటినుండి నేటి వరకు సాహో టీజర్ కోసం ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టుగానే ఈ రోజు 11.30 నిమిషాలకు సాహో టీజర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేసింది సాహో టీం.

బాధయినా హ్యాపీనెస్ అయినా నాతొ షేర్ చేసుకోవడానికి ఎవరు లేరని శ్రద్ద కపూర్ క్యూట్ గా చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవగా... ప్రభాస్ నేనున్నాను అంటూ శ్రద్ద కపూర్ ని కౌగిలించుకోవడం... ఇక టీజర్ మొత్తం ప్రభాస్ చేసే యాక్షన్, అలాగే శ్రద్ద కపూర్ తోనూ దర్శకుడు ఫుల్ యాక్షన్ చేపించేసాడు. కార్ ఛేజింగ్, బైక్ ఛేజింగ్, భారీ యాక్షన్ సన్నివేశాలు, ప్రభాస్ లుక్ అన్ని సాహో సినిమా భారీ తనానికి అద్దం పట్టేలా ఉన్నాయి. తనని ఛేజ్ చేస్తున్న గ్యాంగ్ ని చూసి హీరోయిన్ శ్రద్ద వారంతా ఎవరు అని ప్రభాస్ ని అడిగితె.. ప్రభాస్ మాత్రం కూల్ గా నా ఫాన్స్ అంటే.. దానికి శ్రద్ద ఫాన్స్ అయితే అంత వైలెంట్ గా ఉన్నారేమిటి అని ప్రశ్నిస్తుంది. ఇక డైలాగ్స్ తక్కువ యాక్షన్ ఎక్కువ అన్నట్టుగా సాహో టీజర్ ఉంది. అలాగే వెన్నెల కిషోర్ కూడా కామెడీగా కాకుండా కాస్త సీరియస్ గా అమాయకంగా కనిపిస్తున్నాడు.

ప్రభాస్ లుక్, ప్రభాస్ వాడిన దుస్తులు, శ్రద్ద చేసిన యాక్షన్, ఆమె గ్లామర్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అన్ని భారీ తనానికి నిదర్శనంగా అన్నట్టుగా అనిపిస్తున్నాయి. సాహోలోని యాక్షన్ సన్నివేశాలు మాత్రం హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోవు అన్నట్టుగా ఉన్నాయి. ప్రభాస్ లేట్ చేస్తే చేసాడు కానీ... అభిమానులకు కావాల్సిన ట్రీట్ మాత్రం సాహో తో ఇచ్చేస్తాడని ఫిక్స్ అవ్వొచ్చు. 

Sponsored links

Saaho Teaser Review Talk:

Saaho Teaser Review: Action Packed

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019