సూర్య–మోహన్‌బాబు కాంబో సినిమా ప్రారంభం

Fri 14th Jun 2019 11:10 PM
surya,mohan babu,combination movie  సూర్య–మోహన్‌బాబు కాంబో సినిమా ప్రారంభం
Surya - Mohan babu combo movie సూర్య–మోహన్‌బాబు కాంబో సినిమా ప్రారంభం
Sponsored links

నాయకుడిగా, ప్రతినాయకుడిగా... ఇలా 44 ఏళ్ల నటజీవితంలో ఏ పాత్ర అయినా చేయగలనని మంచు మోహన్‌బాబు నిరూపించుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ ఆయన ఒకే ఒక్క లేడీ డైరెక్టర్‌తో సినిమా చేశారు. కృష్ణ నాయకుడిగా గతంలో విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో మోహన్‌బాబు ప్రతినాయకుడిగా నటించారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన మరో లైడీ డైరెక్టర్‌ సుధ కొంగర దర్శకత్వంలో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్‌ ఉన్న సూర్య ఇందులో హీరో. ‘సూరరై పోట్రు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సూర్యే నిర్మాత కావడం విశేషం. ఇందులో కథకు కీలకంగా నిలిచే అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్రకు మోహన్‌బాబు మాత్రమే యాప్ట్‌ అని ఆయన్ను అప్రోచ్‌ అయింది చిత్రబృందం. కథ, పాత్ర నచ్చి ఈ చిత్రంలో నటించడానికి ఆయన అంగీకరించారు. ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనడానికి గురువారం మోహన్‌బాబు చెన్నై వెళ్లారు. శుక్రవారం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరిగే షూటింగ్‌లో పాల్గొంటారాయన. కాగా ఈ చిత్రంలో మోహన్‌బాబుని నటింపజేయాలనుకున్నప్పుడు ఆయన కుమార్తె లక్ష్మీప్రసన్నను సంప్రతించారు సూర్య, సుధ. ఈ ఇద్దరూ లక్ష్మీకి మంచి స్నేహితులు. ఆ విధంగా ఈ సినిమా గురించి తండ్రి దగ్గర లక్ష్మీప్రసన్న చెబితే, కథ నచ్చి ఒప్పుకున్నారు. ఆరు నెలలకు ముందు ఈ సినిమాకి సైన్‌ చేశారాయన. బాక్సింగ్‌ నేపథ్యంలో హిందీలో ‘సాలా కదూస్‌’, తమిళంలో ‘ఇరుది సుట్రు’ పేరుతో సుధ కొంగర దర్శకత్వం వహించిన చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిన విషయం తెలిసిందే. ‘ఇరుది సుట్రు’ని తెలుగులో ‘గురు’ పేరుతో సుధ కొంగర తెరకెక్కించారు. ఈ మధ్యకాలంలో వచ్చిన డైరెక్టర్స్‌లో డిఫరెంట్‌ డైరెక్టర్‌ అనిపించుకున్న సుధ కొంగర తాజాగా సూర్య–మోహన్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Sponsored links

Surya - Mohan babu combo movie:

Surya - Mohan babu combination movie opening

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019