రాజుగాడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు!

Sat 08th Jun 2019 11:07 PM
raj tarun,next films,details  రాజుగాడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు!
Raj Tarun Next Films Details రాజుగాడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు!
Sponsored links

దర్శకుడు కావాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చి అన్నపూర్ణ వారి ‘ఉయ్యాలా జంపాలా’తో రాజ్‌తరుణ్‌ హీరో అయ్యాడు. ఆ తర్వాత కూడా ‘కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం ఆడోరకం’ వంటి చిత్రాలు చేస్తూ ఓకే అనిపించుకున్నాడు. కానీ ఇటీవల ‘అందగాడు, రంగులరాట్నం, లవర్‌, రాజుగాడు’ వంటి మంచి అంచనాలు ఉన్న చిత్రాలతో దెబ్బలు తిన్నాడు. తాజాగా ఆయన మరోసారి ‘లవర్‌’ బాకీ తీర్చేందుకు దిల్‌రాజుతో కలిసి ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత కూడా రాజ్‌తరుణ్‌ వరుస పెట్టి చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు. 

కె.కె.రాధామోహన్‌ నిర్మాతగా శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌లో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఆ తర్వాత సురేష్‌ ప్రొడక్షన్స్‌లో మరో చిత్రం రూపొందనుంది. ఇక విజయ్‌కుమార్‌ కూడా రాజ్‌తరుణ్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. ఇలా వరుస క్రేజీ ఆఫర్స్‌తో ఈసారి పక్కా హిట్స్‌ కొట్టేలా రాజ్‌తరుణ్‌ ప్లానింగ్‌ చేసుకుంటున్నాడు. దిల్‌రాజు, సురేష్‌ ప్రొడక్షన్స్‌ వంటి సంస్థలు ఉండటంతో ఈసారి రాజుగాడు తన కెరీర్‌ని గాడిలో పెట్టుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. 

Sponsored links

Raj Tarun Next Films Details:

Good Days to Hero Raj Tarun

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019