‘బిగ్‌బాస్‌3’పై ఉత్కంఠ వీడింది..!

Bigg Boss 3 suspense Revealed

Sat 08th Jun 2019 11:05 PM
Advertisement
king nagarjuna,hosts,bigg boss,telugu,season 3  ‘బిగ్‌బాస్‌3’పై ఉత్కంఠ వీడింది..!
Bigg Boss 3 suspense Revealed ‘బిగ్‌బాస్‌3’పై ఉత్కంఠ వీడింది..!
Advertisement

‘బిగ్‌బాస్‌3’ ఈసారికి ఉండదని కొందరు.. కాదు కాదు...ఉంటుందని కొందరు అంటూ వచ్చారు. నిర్వాహకులు మాత్రం ఉంటుందని చెబుతున్నారే గానీ ఎప్పటి నుంచి ఏమిటి? అనేవి చెప్పడం లేదు. దీంతో తెలుగు బిగ్‌బాస్‌3పై ఉత్కంఠ ఏర్పడింది. ఎట్టకేలకు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ నెల కాదు గానీ జులై మధ్యలో బిగ్‌బాస్‌ వచ్చేందుకు రెడీ అవుతున్నాడట. 

నాగార్జున హోస్ట్‌గా చేయనున్న ఈ షో షూటింగ్‌ని తొందరగా ప్రారంభించి షూటింగ్‌ పూర్తి చేస్తారని సమాచారం. ఈసారి పార్టిసిపెంట్స్‌గా పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఉంటారని తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో తనదైన శైలిలో అందరినీ నవ్వించిన కె.ఎ.పాల్‌ కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. 

ఇక మిగిలిన వారి విషయానికి వస్తే యాంకర్‌ ఉదయభాను.. నటి,యాంకర్‌ రేణుదేశాయ్‌, గాయకుడు హేమచంద్ర, జబర్ధస్త్‌ ఫేమ్‌ సుధాకర్‌, యాంకర్‌ లాస్య, యాంకర్‌ రవి, యూట్యూబ్‌ స్టార్‌ మహాతల్లి, యాంకర్‌ సావిత్రి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మత ప్రభోధకుడు కె.ఎ.పాల్‌ ఉంటే మాత్రం ఈ షో డెఫినెట్‌గా హిట్‌ కావడం గ్యారంటీ అనే చెప్పాలి. 

Advertisement

Bigg Boss 3 suspense Revealed :

King Nagarjuna hosts Bigg Boss Telugu season 3

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement