ఆ పుకార్లు నిజమవ్వాలని కోరుకుంటోంది?

Sun 26th May 2019 05:49 PM
rashmika mandanna,heroine,rumours,tamil star hero,vijay film  ఆ పుకార్లు నిజమవ్వాలని కోరుకుంటోంది?
Rashmika Mandanna Reaction on Rumours ఆ పుకార్లు నిజమవ్వాలని కోరుకుంటోంది?
Sponsored links

స్టార్స్‌తో చాన్స్ వస్తే యంగ్ హీరోయిన్లు ఎగిరిగంతేస్తారు. సామాన్యంగా పుకార్లు వస్తే తీవ్రమనస్థాపం చెందే హీరోయిన్లు సైతం స్టార్ హీరోల చిత్రాలలో చాన్స్ దక్కిందనే వార్తలు వస్తే అవే నిజమవ్వాలని దేవుడిని ప్రార్థిస్తారు. ఆ పుకార్లరాయులకి ధన్యవాదాలు తెలుపుతారు. ఇలాంటి పుకారే ఒకటి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్ గా పేరున్న రష్మికామండన్నపై వచ్చింది. దీంతో ఆ పుకారు నిజమవ్వాలని ఆమె కోటి దేవుళ్లకి  మొక్కుకుంటోంది. 

ఇంతకీ ఆమెపై  వచ్చిన వార్త  ఏమిటంటే.. ఆమె కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన జోడీ కట్టనుందనే వార్త ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విజయ్ ప్రస్తుతం అట్లీ  దర్శకత్వంలో ఓ స్టోర్ట్స్ డ్రామా చిత్రంలో నటిస్తున్నాడు. ఆయన సరసన నయనతార హీరోయిన్ గా చేస్తోంది. దీనిని ప్రస్తుతం విజయ్ 63వ చిత్రంగా పిలుస్తున్నారు. ఆయన తదుపరి చిత్రంగా భావిస్తున్న 64లో రష్మికమండన్నని  హీరోయిన్ గా తీసుకున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. 

దీనిపై రష్మికా మండన్న స్పందిస్తూ.. విజయ్ తదుపరి చిత్రాన్ని కొత్త దర్శకుడు తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ నిజం చెప్పాలంటే విజయ్ సినిమా గురించి ఇప్పటి వరకు  నన్ను ఎవ్వరు సంప్రదించలేదు. ఒక వేళ అదే వార్తలు నిజమైతే నాకంటే సంతోషించేవారు ఎవ్వరు ఉండరు. ఈ పుకార్లే నిజమవ్వాలని కోరుకుంటున్నాను...అని తెలిపింది. కాగా  ప్రస్తుతం ఆమె సౌత్ లో అన్ని భాషల్లో విడుదల కానున్న విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ మూవీలో నటిస్తింది.

ఈ మూవీ జులై 26న విడుదల కానుంది. అలాగే  ప్రస్తుతం ఆమె తమిళ స్టార్ కార్తి  సరసన బక్కియరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. దీని అనంతరం ఆమెకి మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందే  చిత్రంలో కూడా మెయిన్ హీరోయిన్‌గా చాన్స్ వచ్చిందని అంటున్నారు.

Sponsored links

Rashmika Mandanna Reaction on Rumours :

Rashmika Mandanna about Vijay Film Chance 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019