‘సాహో’లో సల్మాన్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

Sun 26th May 2019 05:42 PM
salman khan,saaho,prabhas,sujeeth,clarity,rumours  ‘సాహో’లో సల్మాన్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
Director Clarity on Salman in Saaho Rumours ‘సాహో’లో సల్మాన్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
Sponsored links

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సాహో’. దాదాపు 300 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రంను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్‌కి జోడిగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించింది. 

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈసినిమాకు సంబంధించి ఓ యాక్షన్ సీన్స్ కోసమే 90 కోట్ల వరకూ ఖర్చు చేశారట. ఇక సినిమాకి మరింత హైప్ తీసుకుని రావడానికి ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ఓ కీలక రోల్ చేయించారని గత కొన్ని రోజులు నుండి వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే విషయం తెలుసుకున్న దర్శకుడు సుజీత్ స్పందిస్తూ.. ‘‘ఈ సినిమా షూటింగును పూర్తి చేసేశాము. అతిథి పాత్ర కోసం సల్మాన్‌ను సంప్రదిస్తున్నట్టుగా వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అసలు అలాంటి పాత్ర ఏది ఈ సినిమాలో కనిపించదు’’ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో కొన్ని రోజులు నుండి వైరల్ అవుతున్న రూమర్ కి చెక్ పెట్టినట్టైంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

Sponsored links

Director Clarity on Salman in Saaho Rumours:

No Salman Khan in Saaho Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019