Advertisementt

ఇక హైద‌రాబాద్‌లో ‘మ‌న్మ‌థుడు 2’!

Wed 22nd May 2019 04:21 PM
nagarjuna,rakul preet singh,manmadhudu 2,shooting,hyderabad  ఇక హైద‌రాబాద్‌లో ‘మ‌న్మ‌థుడు 2’!
Manmadhudu 2 in Hyderabad ఇక హైద‌రాబాద్‌లో ‘మ‌న్మ‌థుడు 2’!
Advertisement
Ads by CJ

హైద‌రాబాద్‌లో కింగ్ నాగార్జున ‘మ‌న్మ‌థుడు 2’ కొత్త షెడ్యూల్‌

కింగ్‌ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం ‘మ‌న్మ‌థుడు 2’. రీసెంట్‌గా నెల‌పాటు పోర్చుగ‌ల్‌లో లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. మ‌న్మ‌థుడు 2 ఇన్‌స్పిరేష‌న్‌తో మ‌న్మ‌థుడు 2 చిత్రాన్ని లాఫింగ్ రైడ‌ర్‌గా రూపొందిస్తున్నారు. నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్ స‌హా న‌టీన‌టులంద‌రూ పాల్గొనగా ఈ సినిమాకు సంబంధించి పోర్చుగ‌ల్ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ రీసెంట్‌గా పూర్తి చేసింది. త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. 

రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఫ‌న్ రైడ‌ర్ తెర‌కెక్కుతోంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

న‌టీన‌టులు:

కింగ్ నాగార్జున‌

ర‌కుల్ ప్రీత్ సింగ్‌

ల‌క్ష్మి

వెన్నెల‌కిషోర్‌

రావు ర‌మేష్‌

ఝాన్సీ

దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: 

ద‌ర్శ‌క‌త్వం:  రాహుల్ ర‌వీంద్ర‌న్‌

నిర్మాత‌లు:  నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌

నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌

మ్యూజిక్:  చైత‌న్య  భ‌రద్వాజ్‌

సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌:  ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌

స్క్రీన్‌ప్లే:  రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌

ఎడిట‌ర్స్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి

డైలాగ్స్‌:  కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌

కాస్ట్యూమ్స్‌:  అనిరుధ్ సింగ్‌, దీపికా ల‌ల్వాని.

Manmadhudu 2 in Hyderabad:

Nagarjuna and Rakul wrap fun shoot !

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ