బన్నీ- త్రివిక్రమ్ మూవీ తేడా కొడుతోంది!

Wed 22nd May 2019 04:14 PM
allu arjun,trivikram srinivas,movie,doubts  బన్నీ- త్రివిక్రమ్ మూవీ తేడా కొడుతోంది!
Doubts on Allu Arjun and Trivikram Film బన్నీ- త్రివిక్రమ్ మూవీ తేడా కొడుతోంది!
Sponsored links

బన్నీ - త్రివ్రిక్రమ్ సినిమా షూటింగ్ చాలా లేట్ గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈమూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఎక్కడో వ్యవహారం తేడా కొడుతూనే ఉంది. సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ షెడ్యూల్ లోనే బన్నీ-త్రివిక్రమ్ మధ్య కంటెంట్ పరంగా చర్చలు సరిగ్గా సాగలేదని... అలానే బన్నీ- హారిక-హాసిని నిర్మాతల మధ్య కూడా సంబంధాలు పెద్దగా లేనట్టు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు మరో రూమర్ ఏంటంటే... లెక్కప్రకారం ఈ మూవీ యొక్క రెండో షెడ్యూల్ నిన్నటి నుండి స్టార్ట్ కావాలి.. లేదా ఈరోజు అన్నా స్టార్ట్ కావాలి కానీ స్టార్ట్ కాలేదు. బన్నీ తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ లో ఉన్నాడు. ఇంతవరకు హైదరాబాద్ చేరుకోకపోవడం ఒక విషయం అయితే తన పర్యటనను తనకు తానుగా పొడిగించుకున్నాడట బన్నీ. విషయం తెలిసిన  హారిక-హాసిని వాళ్ళు బన్నీపై కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ మూవీని గీత ఆర్ట్స్- హారిక-హాసిని వాళ్ళు కలిసి సంయక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఫస్ట్ షెడ్యూల్ టైములో అల్లు అరవింద్, బన్నీ, మరికొంతమంది ఓ గ్రూప్ గా.. నిర్మాతలు, త్రివిక్రమ్, ఇంకొంతమంది వేరే గ్రూప్ గా ఏర్పడినట్టు తెలుస్తోంది. మరి ఇలా జరిగితే సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తి అయ్యేను? రిలీజ్ ఎప్పుడు అయ్యేను?

Sponsored links

Doubts on Allu Arjun and Trivikram Film:

Producers Unhappy with Bunny Movements

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019