‘కల్కి’ విడుదలకు అడ్డొస్తున్నాడు..!

Tue 21st May 2019 02:42 PM
kk radhamohan,kalki,ngk,release,postponed,rajasekhar,suriya  ‘కల్కి’ విడుదలకు అడ్డొస్తున్నాడు..!
Kalki Release postponed.. because..? ‘కల్కి’ విడుదలకు అడ్డొస్తున్నాడు..!
Sponsored links

తెలుగులో కోలీవుడ్‌ స్టార్స్‌కొందరికి మంచి మార్కెట్‌ ఉంది. కానీ వారు రానురాను ఆ క్రేజ్‌ని తెలుగులో కోల్పోతున్నారు. ఈ విషయంలో రజనీ, కమల్‌, విక్రమ్‌, సూర్య, కార్తి, విజయ్‌ ఆంటోని.. ఇలా అందరు ఒకే దారిలో పయనిస్తున్నారు. ఇక సూర్య విషయం తీసుకుంటే ‘గజిని’తో ఓ రేంజ్‌లో సంచలనం సృష్టించిన ఆయన ఆ తర్వాత తన ప్రతి తమిళ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తూ వస్తున్నాడు. కానీ విక్రమ్‌ కెకుమార్‌ దర్శకత్వంలో ఆయన నటించిన ‘24’ చిత్రం తెలుగు హక్కులు అనూహ్యంగా 22కోట్లకు అమ్ముడయ్యాయి. 

ఆ తర్వాత వచ్చిన ‘సింగం3’ 18కోట్లకు, ‘గ్యాంగ్‌’ 15కోట్లకు గ్రాఫ్‌ దిగజారుతూ వచ్చింది. తాజాగా ఆయన సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించిన ‘ఎన్జీకే’ చిత్రం తెలుగు హక్కులు ఏకంగా రెండంకెల లోపుకు అంటే 9కోట్లకు పడిపోయాయి. ఈ చిత్రం హక్కులను రాధామోహన్‌ దక్కించుకున్నాడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌పై రిలీజ్‌ చేయనున్నాడు. మరోవైపు రాజశేఖర్‌ ‘కల్కి’ చిత్రం హక్కులను కూడా రాధామోహన్‌నే దక్కించుకున్నాడు. 

‘కల్కి’ టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. రాజశేఖర్‌ ‘పీఎస్వీ గరుడ వేగ’తో కంబ్యాక్‌ అయ్యాడు. ‘కల్కి’ని కూడా ‘అ’ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌వర్మ బాగా తీర్చిదిద్దాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. కానీ మే31న విడుదల కావాల్సిన రాజశేఖర్‌ ‘కల్కి’ని వాయిదా వేసి సూర్య ‘ఎన్జీకే’ని విడుదల చేయడంపై భాషాభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. 

Sponsored links

Kalki Release postponed.. because..?:

KK Radhamohan postponed Kalki for NGK

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019