మే 24న ‘అలాద్దీన్’ అద్భుతం

Sun 19th May 2019 02:04 PM
aladdin,movie,release,may 24   మే 24న ‘అలాద్దీన్’ అద్భుతం
Aladdin Movie Ready to Release మే 24న ‘అలాద్దీన్’ అద్భుతం
Sponsored links

మే 24న విడుదల అవుతున్న సమ్మర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అలాద్దీన్’

అరేబియన్ నైట్స్ కథలలో అల్లాద్దీన్ అద్భుత దీపం కథకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, ఈ కథని ఎన్ని సార్లు సినిమా తీసిన, చూసిన ప్రతి సారి కొత్తగానే ఉంటుంది. అందుకే మరో సారి డిస్నీ వారు ప్రస్తుత సాంకేతికతని వాడుకొని, అలాద్దీన్ కథని ఓ విజువల్ వండర్ గా రెడీ చేసారు. భారీ బడ్జెట్ తో అల్లాద్దీన్ కి కొత్త హంగులు జోడించి ప్రేక్షకులను అరేబియన్ రాజ్యం లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే డిస్నీ సంస్థ మర్వెల్ వారు సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టించిన సంగతి తెల్సిందే, అభిమానులు అవెంజర్స్ మ్యానియా నుంచి బయటకి రాకుండానే డిస్నీ వారు అల్లాద్దీన్ వంటి మరో అద్భుతమైన సినిమాను మే 24న విడుదల చేస్తున్నారు. అల్లాద్దీన్ ఇండియాలో భారీగా రిలీజ్ అవ్వడంతో పాటు తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో కూడా విడుదల అవుతుంది. 

అల్లాదిన్ తెలుగు వెర్షన్ కు డబ్బింగ్ చెప్పిన వెంకటేష్, వరుణ్ తేజ్

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ ఇటీవలే బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్ 2 కోసం కలిసి పని చేశారు. వీరిద్దరు మరోసారి అల్లాద్దీన్ కలిసి వర్క్ చేసారు. అయితే ఈ సినిమాలో వీరు కలిసి నటించట్లేదు. ఈ సినిమాలో జీని (దెయ్యం) పాత్రకు వెంకటేష్ గొంతు అరువివ్వడం విశేషం. అలాగే అల్లాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. ఇటీవలే దీనికి సంబంధించిన తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో జీనీగా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించాడు. ఇక అల్లాద్దీన్‌గా మేనా మసూద్ యాక్ట్ చేసాడు. మొత్తంగా వెంకటేష్, వరుణ్ తేజ్ గొంతులతో ‘అల్లాద్దీన్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు మంచి క్రేజ్ వచ్చే అవకాశాలు వున్నాయి.

Sponsored links

Aladdin Movie Ready to Release:

Aladdin Movie Release on May 24

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019