‘రెడ్డిగారి అబ్బాయి’కి విజయశాంతి షాక్!

Sun 19th May 2019 01:35 PM
vijayashanti,demands,mahesh babu,reddy gari abbayi,new movie  ‘రెడ్డిగారి అబ్బాయి’కి విజయశాంతి షాక్!
Vijayashanti demands a whopping sum for Mahesh 26 ‘రెడ్డిగారి అబ్బాయి’కి విజయశాంతి షాక్!
Sponsored links

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు. పార్టీలు మీద పార్టీలు చేసుకుంటున్న మహేష్ అప్పుడే తన నెక్స్ట్ మూవీ పనుల్ని కూడా స్టార్ట్ చేసేసారు. మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులు నుండి ఈ సినిమాకు సంబంధించి రెండు వార్తలు వైరల్ అవుతున్నాయి. 

అందులో ఒకటి ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ విజయశాంతి నటిస్తున్నట్టు తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఈమె తీసుకునే రెమ్యూనరేషన్ షాకింగ్ గా ఉంది. ఈ సీనియర్ నటి ఈ చిత్రంలో నటించేందుకు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. రేట్ విని షాక్ తిన్న నిర్మాతలు చేసేది ఏమిలేక ఆమె అడిగినంత ఇచ్చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇంత రెమ్యూనరేషన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసే డైరెక్టర్ తీసుకోడు అండ్ ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్ కూడా తీసుకోరు. మరి విజయశాంతి ఎందుకు అంత రేట్ చెప్పింది?

అలానే మరో వార్త ఈ సినిమా యొక్క టైటిల్. దీనికి ‘రెడ్డిగారి అబ్బాయి’ అనే టైటిల్ ను పెడితే ఎలా ఉంటుందో అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. దాదాపు ఈ టైటిలే కన్‌ఫర్మ్ అయినట్టు సమాచారం. ఇది రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని అందుకే ఈ టైటిల్ అనుకుంటున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వరకు ఆగాల్సిందే.

Sponsored links

Vijayashanti demands a whopping sum for Mahesh 26:

Lady Amitabh Shocks Mahesh Babu  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019