మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌లు వీరేనా?

Thu 25th Apr 2019 09:05 PM
mahesh babu,maharshi,pre release event,ram charan,ntr,chief guests  మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌లు వీరేనా?
NTR, Ram Charan For Maharshi Pre-Release మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌లు వీరేనా?
Sponsored links

మహేష్ బాబు 25 వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ వరల్డ్ వైడ్ గా మే 9 న రిలీజ్ అవుతున్న సంగతి తెల్సిందే. కాగా ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించాలని మహేష్ టీం చేస్తుంది. అందుకే ఈ ఈవెంట్ కి తనతో గతంలో పని చేసిన 24 సినిమాల డైరెక్టర్స్ ని ఇన్వైట్ చేయాలనీ చూస్తున్నాడు మహేష్. ఈ ఈవెంట్ మే 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా దగ్గర జరగనుంది.

అలానే మహేష్ మరో ఇద్దరూ స్టార్ హీరోస్ ని ఇన్వైట్ చేయనున్నాడు. ఆ ముఖ్య అథితులు ఎవరో కాదు ఎన్టీఆర్ అండ్ చరణ్. వీరిద్దరిలో ఒకరు కానీ ఇద్దరు కానీ వచ్చే అవకాశముంది చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ అండ్ చరణ్ ఇద్దరు మహేష్ కి మంచి స్నేహితులు కావడం వలన, ఇద్దరూ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకుంటున్నారు. 

ఎన్టీఆర్ ఆల్రెడీ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ఉన్నాడు. ఎన్టీఆర్, చరణ్ లు ఇద్దరూ వస్తే అభిమానులకి అంతకుమించిన పెద్ద పండుగ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికార న్యూస్ రావాల్సి ఉంది.

Sponsored links

NTR, Ram Charan For Maharshi Pre-Release:

NTR, Charan Coming For Mahesh

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019