అవెంజర్స్- ఎండ్‌గేమ్‌పై ఎవరి లెక్కలు వారికి..!

Thu 25th Apr 2019 08:59 PM
avengers endgame,biggest opening,weekend,grosser  అవెంజర్స్- ఎండ్‌గేమ్‌పై ఎవరి లెక్కలు వారికి..!
Avengers Endgame to Become Biggest Opening Weekend Grosser అవెంజర్స్- ఎండ్‌గేమ్‌పై ఎవరి లెక్కలు వారికి..!
Sponsored links

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ విన్న ఏ న్యూస్ చూసిన ఇదే మాట్లాడుకుంటున్నారు. వరల్డ్ వైడ్ గా ఈమూవీ భారీ అంచనాలు మధ్య ఈనెల 26 న రిలీజ్ అవ్వబోతుంది. సో వరల్డ్ మొత్తం ఈచిత్రం యొక్క కలెక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. బాక్సాఫీస్ ఓపెనింగుల దృష్ట్యా ఇప్పటివరకూ ఈ చిత్రం నెంబర్ 1 అని ఫేమస్ రోటెన్ టమోటాస్ వెబ్ సైట్ సైతం కీర్తించేసింది. 

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసినిమాకి క్రేజ్ మాములుగా లేదు. డే-1 టిక్కెట్లు అన్నీ అయిపోయాయంటూ బుక్ మై షో సహా ఆన్ లైన్ టికెటింగ్ విండోలన్నీ లాక్ అయిపోవడం ప్రధానంగా చర్చకు వచ్చింది. అవతార్ తరువాత అంతటి క్రేజ్ వచ్చిన చిత్రం ఇదే కావడం విశేషం. సో ఈసినిమా వచ్చాకా అంతకుముందు ఏమైతే రికార్డ్స్ ఉన్నాయో అవన్నిటిని బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

ప్రపంచవ్యాప్తంగా తొలివారంలోనే 6900 కోట్లు (1 బిలియన్ డాలర్స్) వసూలు చేస్తుందన్నది నిపుణుల విశ్లేషణ. ఇండియా లో బాహుబలి, దంగల్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లాంటి బెస్ట్ ఓపెనర్ల రికార్డుల్ని ఈ చిత్రం బ్రేక్ చేస్తుందని ప్రఖ్యాత ట్రేడ్ అనలిస్ట్ గిరీష్ జోహార్  చెబుతున్నారు. అమెరికాలో అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని అలానే చైనాలో 250 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ వసూళ్లను తెస్తుందని అంచనా వేస్తున్నారు. సో ఈసినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరో కొన్ని గంటల్లో ఈసినిమా మన ముందుకు రానుంది.

Sponsored links

Avengers Endgame to Become Biggest Opening Weekend Grosser:

World’s Biggest Opening Grosser  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019