విజయశాంతి కాదు.. టబు చేస్తోంది

Fri 19th Apr 2019 04:22 PM
tabu,venu oodugula,vijayashanti,rana daggubati,virataparvam 1992  విజయశాంతి కాదు.. టబు చేస్తోంది
Tabu Replaces VijayaShanti విజయశాంతి కాదు.. టబు చేస్తోంది
Sponsored links

‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్షన్ లో రానా దగ్గుబాటి చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం 1992’. 1992 బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ థ్రిల్లర్ మూవీ లో రానా కి జోడిగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. తొలిసారి రానా తో సాయి పల్లవి నటిస్తుంది.

అలానే ఓ ముఖ్య పాత్రలో సీనియర్ హీరోయిన్ టబు నటిస్తున్నట్లు సమాచారం. అయితే నిజానికి టబు పాత్ర మరో సీనియర్ హీరోయిన్ చేయాల్సివుంది. ఆమె విజయశాంతి. మొదట టబు పాత్ర కోసం చిత్ర టీం విజయశాంతి ని సంప్రదించగా ఆమె ఓకే కూడా చెప్పి తరువాత అడిగిన డేట్లు కేటాయించ లేకపోవడం వలన సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది.

సో అలా విజయశాంతి ప్లేస్ లో టబు వచ్చింది. టబు ఆమధ్య తెలుగులో 2008 లో ‘పాండురంగడు’ సినిమాలో కనిపించింది. గత కొంత కాలంగా బాలీవుడ్ లో బిజీగా ఉంది. రీసెంట్ గా అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

Sponsored links

Tabu Replaces VijayaShanti:

Tabu in Virataparvam 1992

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019