‘గల్లీబాయ్’ రీమేక్‌కు హీరో ఫిక్సయినట్టేనా?

Fri 19th Apr 2019 04:00 PM
vijay devarakonda,gally boy,remake,bollywood  ‘గల్లీబాయ్’ రీమేక్‌కు హీరో ఫిక్సయినట్టేనా?
Gally boy Remake Hero Confirmed ‘గల్లీబాయ్’ రీమేక్‌కు హీరో ఫిక్సయినట్టేనా?
Sponsored links

బాలీవుడ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 14న విడుదలైన ‘గల్లీబాయ్‌’ ఎంత సక్సెస్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా ఆలియా భట్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రం దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొంది బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద రూ.230 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు.

అయితే ఇప్పుడు ఈచిత్రంను తెలుగు రీమేక్ చేయాలనీ డిసైడ్ అయ్యారు మన మేకర్స్. ఇందులో సాయిధరమ్ తేజ్‌ నటించే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.  అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే నిర్మాతలు విజయ్ ను సంప్రదింపగా ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

విజయ్ ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. అలానే నిన్ను కోరి, మజిలీ ఫేమ్  శివ నిర్వాణతోనూ ఓ మూవీ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Sponsored links

Gally boy Remake Hero Confirmed:

Vijay Deverakonda in Gally Boy Remake

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019