వడ్డీలోడు వచ్చెనే... గడ్డి కోసం చూసెనే..

Sun 14th Apr 2019 12:24 PM
ngk,suriya,vaddeelodu vachhene,first single,suriya ngk,sri raghava  వడ్డీలోడు వచ్చెనే... గడ్డి కోసం చూసెనే..
NGK First Song Released వడ్డీలోడు వచ్చెనే... గడ్డి కోసం చూసెనే..
Sponsored links

‘ఎన్.జి.కె’ ఫస్ట్ సింగిల్‌తో సందడి చేస్తున్న సింగం సూర్య

‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్.జి.కె’ (నంద గోపాల కృ ష్ణ). ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రెమండెస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. 

కాగా, శుక్రవారం ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు. ‘వడ్డీలోడు వచ్చెనే... గడ్డి కోసం చూసెనే...’ అడ్డమైన మాటలే.. అడ్డేలేక వాగెనే..’ అంటూ చంద్రబోస్ రాసిన పాటను సత్యన్ అద్భుతంగా పాడారు. ఈ పాటకు యువన్ శంకర్‌రాజా అందించిన సంగీతం చాలా డిఫరెంట్‌గా ఉంది. సూర్య తో జంటగా సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 

సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్, ఎడిటింగ్: జి.కె.ప్రసన్న, ఆర్ట్: ఆర్.కె.విజయ్ మురుగన్, నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, దర్శకత్వం: శ్రీరాఘవ.

Click Here for Song

Sponsored links

NGK First Song Released:

First Single From Singam Suriya’s NGK, Vaddeelodu Vachhene..Gaddi Kosam Choosene.. Launched

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019