Advertisement

‘మజిలీ’ ట్రైలర్ చూసి.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయట!

Tue 02nd Apr 2019 11:59 AM
samantha,naga chaitanya,majili,pre release event,nagarjuna,venkatesh  ‘మజిలీ’ ట్రైలర్ చూసి.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయట!
Majili Pre Release Event Highlights ‘మజిలీ’ ట్రైలర్ చూసి.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయట!
Advertisement

‘మజిలీ’ ట్రైలర్ చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.. చైతు, సమంత కెరీర్ లోనే ‘మజిలీ’ ది బెస్ట్ సినిమా అవుతుంది - మజిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో అక్కినేని నాగార్జున, వెంకటేష్.. ఏప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల..!!

టాలీవుడ్ క్రేజీ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత కలిసి చేస్తున్న తొలి సినిమా ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని షైన్ స్క్రీన్ బ్యానర్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుండగా, గోపి సుందర్ సంగీతం, ఎస్.ఎస్. థమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి విశేష స్పందన లభిస్తుంది. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరగగా ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు ముఖ్య అతిధులుగా అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లు హాజరయ్యారు. చిత్ర ఆడియో సీడీని విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసి నాగార్జున గారికి ప్రజెంట్ చేశారు. 

ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ మాట్లాడుతూ.. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పుడే నాకు తెలిసిన డైరెక్టర్ కృష్ణ చైతన్యని ఈ డైరెక్టర్ పనితనం గురించి అడిగాను. మంచి ఫీల్ గుడ్ మూవీస్ చేస్తున్నాడు. శివ చేసిన ఫస్ట్ ఫిల్మ్ చూశాను. అది చాలా ఫీల్ గుడ్ మూవీ. బ్రిలియంట్ గా తెరకెక్కించాడు. ప్రొడ్యూసర్స్ కూడా నాకు మంచి మిత్రులు.  నాకీ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ గారికి కృతజ్ఞతలు. నేను ఈ ఫంక్షన్ కి రావడానికి కారణం సినిమాలో మంచి లవ్ ఫీల్ ఉంది. ఈ సినిమా అనేది ఒక లైఫ్ అయితే నేను ఆక్సీజన్ ని అందించాను. అంత మంచి కంటెంట్ ఉంది ఈ సినిమాలో.  మౌనరాగం లాంటి సినిమా చేయాలనీ ఎప్పటినుంచో కోరిక ఉంది. తొలిప్రేమతో అది కొంత తీరింది. ఈ సినిమాతో మొత్తం తీరిందని అనుకుంటున్నాను. మజిలీ నాకు స్పెషల్ మూవీ. పది రోజులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాను. చైతు తన పాత్రలో జీవించేశాడు. చైతుని ఎలా చూడాలనుకున్నానో అలానే డైరెక్టర్ చూపించాడు. సినిమాకి తగ్గట్లే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సమంత కెరీర్, నా కెరీర్ ఒకేసారి మొదలైంది. తమిళ్ లో ఒకే సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యాం. సౌత్ ఇండియాలోనే బ్రిలియెంట్ నటి ఆమె. ఈ సినిమాలో ఆమె నటన చూసినప్పుడు చాలా ఫీల్ అయ్యాను. చాలా మంచి పాత్ర చేసింది. ప్రొడ్యూసర్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమాకి మంచి లైవ్ కంపొజిషన్స్ వాడాము. లైవ్ మ్యూజిక్ లేకపోతే లైఫ్ లేదనే ఉద్దేశ్యంతోనే అలా చేయాల్సి వచ్చింది.  గోపి సుందర్ మ్యూజిక్ చాలా బాగుంది. మంచి కీ బోర్డు ప్రోగ్రామర్. మెలోడీ సాంగ్స్ ని చాలా బాగా ట్యూన్ చేశాడు. అన్నారు.

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ. ఏ మాయ చేశావే జంట సమంత, నాగచైతన్యలని మరోసారి వెండితెరపై చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో అది తీరుతుంది. అక్కినేని అభిమానులకు మజిలీ సినిమా పండగ లాంటిది. సినిమాలో అన్ని పాటలు విన్నాను. చాలా బాగున్నాయి. విజువల్ గా కూడా చాలా బాగున్నాయి. శివ డైరెక్షన్ లో వచ్చిన నిన్ను కోరి ఎంత బాగుందో అంతకంటే ఎక్కువగా ఈ సినిమా బాగుంటుందని అనుకుంటున్నాను. టీజర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అన్నారు.

దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ.. ఏమాయచేశావే సినిమా చూసి నా కెరీర్ లో అలాంటి లవ్ ఫీల్ ఉన్న సినిమా తీయాలని అనుకున్నాను. దాని ఇన్స్పిరేషన్ సినిమానే గీతగోవిందం. పెళ్ళైన తర్వాత సమంత, నాగచైతన్య ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న ఈ మజిలీ సినిమా వారి జీవితంలో మరుపురాని మజిలీగా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ శివ నిర్వాణ నాకు సోదరుడు లాంటోడు. ఆయనకి తన ద్వితీయ విఘ్నం దాటేయాలని కోరుకుంటున్నాను. అల్ ది బెస్ట్.  ఈ సినిమాకి పనిచేసిన నటీనటులకు, టెక్నిషియన్స్ కి అందరికి ఈ సినిమా ద్వారా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. అన్నారు.

హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ మాట్లాడుతూ. నాకీ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ గారికి థాంక్స్ ఒక్కటే చెప్పలేను. ఆయనకి చాలా రుణపడి ఉన్నాను. మీ ఓపిక , మీ హుందాతనం ఎంతో నచ్చింది.  నానుంచి మంచి పెర్ఫార్మన్స్ ని తీసుకున్నారు. చైతు గారితో పనిచేయడం ఆనందంగా ఉంది. అయన మంచి మనిషి. నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. మంచి కో స్టార్ తో పనిచేశాను. నాకు తెలిసి ఇంత మంచి కో స్టార్ తో కలిసి మళ్ళీ పనిచేస్తాను అనుకోవట్లేదు. అన్నారు.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ కి విచ్చేసిన నాగార్జున గారికి, వెంకటేష్ గారికి వారి అభిమానులకు నమస్కారం. ఒక డైరెక్టర్ పర్సనల్ క్యారెక్టర్ ని బట్టి తన బిహేవియర్ ని బట్టి తన సినిమాలోని హీరో పాత్రలు కానీ మిగితా పాత్రలు రిఫ్లెక్ట్ అవుతాయని రవితేజ గారు చెప్పేవారు. అది అక్షరాలా నిజం. శివ మనసుని తెలియయపరిచే సినిమాలు అయన చేసిన నిన్ను కోరి, మజిలీ సినిమాలు. ఆల్రెడీ థమన్ పేపర్ లీక్ చేశాడు సినిమా తప్పకుండ హిట్ అవుతుంది. చైతు గొప్ప నటుడు. ఎందుకంటే స్క్రిప్ట్ లో కలుగజేసుకోడు. నాగ చైతన్య డైరెక్టర్స్ హీరో. అది చాలు అయన వ్యక్తిత్వం గురించి చెప్పడానికి. సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో మంచి నటి సమంత. గోపి సుందర్ మంచి సంగీతం ఇచ్చాడు. థమన్ బ్యాక్ గ్రౌండ్ అదరగొడుతున్నాడు. సినిమాకి పనిచేసిన అందరికి అల్ ది బెస్ట్ అన్నారు.

డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మా మజిలీ సినిమాకి విషెష్ చెప్పడానికి వచ్చిన నాగార్జున, వెంకటేష్ గారికి థాంక్స్. నిన్నుకోరి తర్వాత ఆ జోనర్ లో కాకుండా వేరే జోనర్ లో ఏదైనా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు  చైతు గారు ఫోన్ చేసి సినిమా చేయాలనీ అడిగారు. ఆ టైంలో నాదగ్గర ఏ కథ లేదు. ఇరవై రోజుల తర్వాత ఒక ఐడియా ఫ్లాష్ అయ్యింది. వెంటనే హీరో పాత్ర గురించి చెప్పాను. ఆయనకు బాగా సూట్ అయింది అనిపించింది.  చైతు గారి కోసం మాత్రమే తయారు చేసిన కథ ఇది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరా అనుకున్నప్పుడు సమంత గారు తప్ప వేరే ఎవరు ఫ్లాష్ అవలేదు. సినిమా బిజినెస్ కోసం సమంతని తీసుకోలేదు. ఈ పాత్రను ఆవిడ తప్ప ఎవరు చేయలేదనే ఆమెను ఎన్నుకున్నాం. ఇద్దరు సినిమా కోసం ప్రాణం పెట్టారు. సమంత గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆమె ఇరగదీశారు. ఆమె పెర్ఫార్మన్స్ చూస్తూనే స్క్రిప్ట్ లో ఏమైనా తక్కువ రాశానా అనిపిస్తుంది. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే చైతు నటన. ఆయన అదరగొట్టారు. సినిమా చూసిన తర్వాత కౌగిలించుకుని ఏడ్చేస్తారు. అంత బాగా నటించారు.  సినిమాలో అందరు చాలా బాగా నటించారు. రావు రమేష్ గారు, పోసాని గారు అద్భుతంగా నటించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెళ్లి తర్వాత ఉండే లవ్ స్టోరీ సినిమా ఇది. ఇలాంటి మంచి ఫీల్ ఉన్న సినిమాని, కమర్షియల్ హంగులు లేని ఈ సినిమాని నమ్మి ఒప్పుకున్న  ప్రొడ్యూసర్స్ గారికి చాలా థాంక్స్. సినిమా చాలా బాగుంటుంది. టెక్నిషియన్స్ బాగా పనిచేశారు. లాస్ట్ మినిట్ లో థమన్ దేవుడిలా వచ్చాడు. మంచి మ్యూజిక్ ఇచ్చారు. గోపి సుందర్ గారు మంచి పాటలు ఇచ్చారు. దివ్యాన్ష కౌశిక్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తెలుగులో మంచి అవకాశాలు రావడం ఖాయం. అటు ఐపీఎల్ ఉన్నా, ఎలక్షన్స్ ఉన్నా సినిమా చాలా బాగా ఆడుతుంది అందరు తప్పకుండా చూడండి. అన్నారు.

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ..  ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, అభిమానులకు చాలా థాంక్స్. ఈ సినిమా తప్పకుండా మంచి సినిమా అవుతుంది. చైతు, సమంత గారి సపోర్ట్ మర్చిపోలేనిది. నాకు అన్ని విధాలా సహకరించిన చిత్ర యూనిట్ కి కృతజ్ఞతలు. ఇంత మంచి సినిమా చేసిన శివ నిర్వాణ గారికి కృతజ్ఞతలు అన్నారు.

హీరోయిన్ సమంత అక్కినేని మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ కి వచ్చిన నాగార్జున గారికి, వెంకటేష్ గారికి చాలా థాంక్స్. వారు రావడం వల్లే ఈ ఫంక్షన్ కి ఇంత క్రేజ్ వచ్చింది. మజిలీ సినిమా ఒక యూనిక్ నిజమైన లవ్ స్టోరీ. ఏమాయచేశావే, మనం తర్వాత మజిలీ సినిమా నా కెరీర్ లో ఎఫెక్టివ్ సినిమాగా మిగిలిపోతుంది. ఇంత మంచి సబ్జెక్ట్ కోసం నన్ను సెలెక్ట్ చేసిన శివ నిర్వాణ గారికి చాలా థాంక్స్. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే లవ్ స్టోరీపై సినిమా రాలేదేంటా అనుకునే టైంలో శివ గారు మజిలీ స్టోరీ చెప్పారు. కథ నచ్చి వెంటనే ఒప్పుకున్నాను. చైతు గురించి నేను చెప్పడం కన్నా సినిమా విడుదల తర్వాత మీరే చెప్తే బాగుంటుంది. ఈ సినిమాకి పనిచేసిన అందరికి కృతజ్ఞతలు. థమన్ గారికి థాంక్స్. లాస్ట్ మినిట్ లో మంచి హెల్ప్ చేశారు. ప్రొడ్యూసర్ చాలా కూల్ పర్సన్స్. అందుకే మంచి అవుట్ ఫుట్ వచ్చింది. ఏప్రిల్ 5 న కలుద్దాం అన్నారు.

అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ కి వచ్చిన అక్కినేని నాగార్జున గారికి, వెంకటేష్ గారికి చాల థాంక్స్. పెళ్లి తర్వాత కలిసి ఇంత త్వరగా ఓ సినిమా చేస్తామని అనుకోలేదు. పెళ్లి తరవాత ఎలాంటి సినిమా అయితే నేను సమంత చేయాలనుకున్నామో అలాంటి కథని శివ తీసుకొచ్చాడు. థాంక్స్ శివ. శివ డైరెక్షన్ లో ఇంత మంచి పాత్ర చేయడం నాకు సంతృప్తినిచ్చింది. మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా చేసేటప్పుడు ఎప్పుడు డౌట్ రాలేదు. శివతో పనిచేయడం గొప్పగా ఉంది. శివతో పనిచేయడం ఎప్పటికి మర్చిపోలేను. అతనితో మళ్ళీ మళ్ళీ పనిచేస్తాను. ఇలాంటి కంటెంట్ తో సినిమా చేసిన ప్రొడ్యూసర్స్ గారికి మంచి గట్స్ ఉన్నాయి. సినిమాని ఇంత బాగా తీసుకురావడంలో వారి కష్టం చాలా ఉంది. నాకు సమంతకు ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. వారు కూడా అంతే ఇదిగా ఈ సినిమాని నిర్మించారు.. దివ్యాన్ష చాలా బాగా నటించింది. సమంత పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. చాలా బాగా యాక్ట్ చేసింది. థమన్ ఈ సినిమాకి చేయడం ప్లస్ పాయింట్. లాస్ట్ మినిట్ లో ఆయన ఈ సినిమాకి ఒప్పుకోవడం సినిమా లైఫ్ నే మార్చేసింది. డీఓపీ విష్ణు ఓ పెయింటింగ్ లా ఈ సినిమాని తీశారు. ఆర్టిస్ట్స్, టెక్నిషియన్స్ అందరు చాలా బాగా పనిచేశారు. అందరం హ్యాపీగా సినిమాకి పనిచేశాం. ఈ సినిమా ఎవ్వర్నీ నిరాశపరచదు. ఏప్రిల్ 5 న సినిమా రాబోతుంది. అందరు తప్పకుండా చూడండి అన్నారు.

విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. మజిలీ టీజర్ చూడగానే సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నాను. ఇందాక ట్రైలర్ చూడగానే సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం కలిగింది. ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు శివ. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ లో చూసినప్పుడే అయన పనితనం తెలిసింది. నిన్నుకోరితోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టబోతున్నాడు. చైతు, సమంతలకు బెస్ట్ సినిమా అవుతుంది. ఏప్రిల్ 5 న ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. టెక్నిషియన్స్  అందరు చాలా బాగా వర్క్ చేశారు. గోపి మంచి పాటలు ఇచ్చారు. థమన్ మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే ఉంటాడు. ఈ సినిమా తప్పకుండా చూడండి అన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. సినిమా టీం అంతా చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది. మంచి విషయం. రెండు పాటలు చాలా బాగున్నాయి అని విన్నాను. చాల హ్యాపీగా ఉంది. అందరికి అల్ ది బెస్ట్. నిన్నుకోరి సినిమా చూసి చాలా బాగుందనుకున్నాను. ఆ తర్వాత చైతుతో కలిసి మజిలీ సినిమా చేయడం చాలా ఆనందకరమైన విషయం.  ట్రైలర్ చాల బాగుంది. చూస్తుంటే రెండు సార్లు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సినిమా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అందరు శ్రద్ధతో చాలా కష్టపడి సినిమా చేశారు. ఈ ఉగాది మాకు సంతోషకరమైన ఉగాది అవబోతుంది. మజిలీ టీమ్ కి అల్ ది బెస్ట్ అన్నారు.

Majili Pre Release Event Highlights:

Celebrities Speech at Majili Pre Release Event

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement