Advertisement

ఆ సినిమా దిల్ రాజుకు డౌట్ కొడుతుందా?

Tue 02nd Apr 2019 11:30 AM
sharwanand,samantha,96 movie,remake,doubts,dil raju  ఆ సినిమా దిల్ రాజుకు డౌట్ కొడుతుందా?
Dil Raju not Confident on 96 Remake ఆ సినిమా దిల్ రాజుకు డౌట్ కొడుతుందా?
Advertisement

ఈమధ్యన తమిళనాట హిట్ అయిన సినిమాలను తెలుగు యూత్ అమెజాన్ ప్రైమ్ విదేశ లోనో, లేదంటే తమిళ రాకర్స్ లోనో చూసేస్తున్నారు. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలన్నీ దాదాపుగా తమిళంలోనే యూత్ వీక్షించేస్తున్నారు. అలాంటి వాటిలో విక్రమ్ వేద, 96, తేరి, మెర్సల్, రచ్ఛాసన్, అంజలి సిబిఐ వంటి చిత్రాలను ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు తమిళంలో వీక్షించేసారు. చాలా సినిమాలు తమిళంతో పాటుగా తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తారు నిర్మాతలు. కానీ కొన్ని సినిమాలెందుకో తమిళనాట విడుదలైనా తెలుగులో డబ్ చెయ్యకుండా ఆపేస్తున్నారు. ఆ సినిమాలు తెలుగులో రీమేక్ అవడానికి సిద్దమవుతున్నాయన్నమాటే. తాజాగా అలాంటి సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తే ఎలాంటి క్రేజ్ ఉంటుందనేది ప్రస్తుతము అంతుబట్టని ప్రశ్నే. విక్రమ్ వేద  రీమేక్ అంటున్నారు కానీ.. ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక రవితేజ తమిళ తేరిని సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కనకదుర్గగా రీమేక్ చెయ్యబోతున్నాడు. అలాగే రచ్చసన్ ని బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో  రీమేక్ చేస్తుండగా... దిల్ రాజు తమిళ క్లాసిక్ 96 రీమేక్ కోసం ఎదురు చూస్తున్నాడు.

మరి తమిళనాట మీడియం బడ్జెట్ సినిమాలుగా తెరకెక్కిన ఈ సినిమాలన్నీ తెలుగులో ఇంకా డబ్ అయితే చేసుకోలేదు కానీ.... తమిళ భాషలోనే ఈ సినిమాలని ప్రేక్షకులు చూసేస్తే.. రీమేక్ చేస్తే పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చనేది చాలామంది ప్రేక్షకుల అభిప్రాయం. మరి తేరి రీమేక్ ని ఇంకా రవితేజ స్టార్ట్ చెయ్యలేదు కానీ.... ప్రాసెస్ లో ఉంది. ఇక బెల్లంకొండ రచ్ఛాసన్ ని ఆఫీషియల్ గా మొదలెట్టేసాడు. ఇక దిల్ రాజు, శర్వానంద్, సమంత జంటగా 96 రీమేక్ మొదలెట్టడానికి మీనమేషాలు లెక్కెడుతున్నాడు. 

మరి దిల్ రాజు కి ఎక్కడో ఏదో డౌట్ కొట్టబట్టే ఇంకా 96 రీమేక్ విషయంలో ఆలోచనలో ఉన్నాడా అనే డౌట్ ఇప్పుడు మనకి కొడుతోంది. ఇక తాజాగా తమిళంలో సూపర్ డీలక్స్ సినిమా రికార్డులను సృష్టిస్తుంది. విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ నటించిన ఆసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మరా సినిమాని తెలుగులో ఏ హీరో రీమేక్ చేస్తాడో అనేది ప్రస్తుతమున్న హాట్ టాపిక్.

Dil Raju not Confident on 96 Remake:

Doubts on 96 Movie Remake

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement