వర్మ ప్లాన్ చేశాడంటే.. అంతే!

Mon 11th Feb 2019 08:05 PM
ram gopal varma,lakshmis ntr,plan,posters,social media  వర్మ ప్లాన్ చేశాడంటే.. అంతే!
Varma Master Plan for Lakshmi’s NTR వర్మ ప్లాన్ చేశాడంటే.. అంతే!
Sponsored links

ఎన్టీఆర్ బయోపిక్ లో ఆల్రెడీ ఒక పార్టు వచ్చేసింది. కథానాయకుడు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు రెండో పార్టు మహానాయకుడు రాబోతుంది. దీనిపై ప్రేక్షకుల్లో ఎటువంటి అంచనాలు లేవు. కానీ వర్మ దీనికి కౌంటర్ గా తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మాత్రం మంచి క్రేజ్ ఏర్పడింది.

అయితే గత కొన్ని రోజుల నుండి ఈ సినిమాపై ఓ రేంజ్ లో డిస్కషన్ స్టార్టైంది. కేవలం పోస్టర్స్ తో, సోషల్ మీడియా పోస్ట్స్ తో ఈ సినిమాను బిజినెస్ చేయాలనీ చూశాడు డైరెక్టర్ వర్మ. ఈ మూవీకి మొత్తం థియేట్రికల్ రైట్స్ ఏకంగా 25 కోట్లు ఇష్టం అని ముందుకు వచ్చాడట. ఐతే ఈ చిత్రం తీసుకున్న తరువాత దీన్ని విడుదల చేయకుండా చూడాలని వారి ప్లాన్ అంట. ఈ విషయం ఆ చెవిన, ఈ చెవిన పడి చివరికి వర్మ చెవిన పడింది.

అందుకే ఈ సినిమా యొక్క బిజినెస్ విషయంలో వర్మ ఆచి, తూచి అడుగులు వెయ్యాలని ఫిక్స్ అయ్యారట. టీజర్ రిలీజ్ చేసి రెస్పాన్స్ ఎలా ఉందో చూసి అప్పుడు బిజినెస్ ను పెంచుదాం అని వర్మ ప్లాన్ అంట.  దానికి తోడు వివాదాలు కూడా ఈ సినిమాకు ఎప్పటిలాగే ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి. మరి వర్మ బిజినెస్ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూద్దాం.

Sponsored links

Varma Master Plan for Lakshmi’s NTR:

Varma Superb Decision for Lakshmi’s NTR

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019