ఆకాష్ రొమాంటిక్ యాంగిల్ చూపిస్తాడట!!

Mon 11th Feb 2019 07:53 PM
akash puri,romantic movie,puri jagannadh touring talkies,puri connects  ఆకాష్ రొమాంటిక్ యాంగిల్ చూపిస్తాడట!!
Akash Puri Next Movie ROMANTIC ఆకాష్ రొమాంటిక్ యాంగిల్ చూపిస్తాడట!!
Sponsored links

యంగ్ హీరో ఆకాష్ పూరి హీరోగా పరిచయమైన తొలి సినిమా మెహబూబా తో నే విమర్శకుల ప్రశంశలు అందుకున్నాడు.. ఈ చిత్రం తరువాత ఆకాష్ రొమాంటిక్ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు.. ఈమేరకు నిర్మాతలు టైటిల్ ని ప్రకటించారు.. ఈరోజే సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం కాగా,  హీరో కళ్యాణ్ రామ్, సీనియర్ నటి రమాప్రభ లు ముఖ్య అతిధులుగా విచ్చేశారు.. చిత్రం తొలి సన్నివేశానికి హీరో కళ్యాణ్ రామ్ క్లాప్ కొట్టారు.. నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈరోజునుంచి జరుపుకుంటుంది.. ఈ చిత్రం లో ఆకాష్ సరికొత్త లుక్, స్టైలిష్ గా లో కనిపించనున్నాడు.. రొమాంటిక్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి పూరి జగన్నాధ్  కథ, స్క్రీన్ ప్లే , మాటలు అందించడం విశేషం.. పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాధ్ , ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.. ఈ సంవత్సరంలో ఈ బ్యానర్ నుంచి వస్తున్న రెండో సినిమా కాగా,  రామ్ హీరో గా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటుంది.. 

నటీనటులు :  ఆకాశ్ పూరి

సాంకేతిక నిపుణులు : 

కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్: పూరి జగన్నాధ్

దర్శకుడు: అనిల్ పాదూరి

నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్

సమర్పణ : లావణ్య

బ్యానర్లు: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్

Sponsored links

Akash Puri Next Movie ROMANTIC:

Akash Puri ROMANTIC Movie Opening and Movie Details 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019