ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ రిలీజ్ కష్టమేనా?

Sun 27th Jan 2019 11:26 PM
balakrishna,mahanayakudu,release,postponed  ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ రిలీజ్ కష్టమేనా?
Again NTR Mahanayakudu Release Date Postponed ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ రిలీజ్ కష్టమేనా?
Sponsored links

కథానాయకుడు రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్న ఇంతవరకు మహానాయకుడుపై ఎటువంటి అంచనాలు లేవు. కారణం మొదటి పార్ట్ డిజాస్టర్ కావడమే. మొదటి పార్ట్ హిట్ అయి ఉంటే వేరే విధంగా ఉండేది. కానీ అలా జాగరలేదు . మహానాయకుడు రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. మొదట ఫిబ్ర‌వ‌రి 7 అన్నారు తరువాత 15కి వెళ్లింది, ఇప్పుడు 21 అంటున్నారు. అయితే ఇప్పటివరకు రిలీజ్ డేట్ ఎప్పుడో మాత్రం మేకర్స్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

పైగా మహానాయకుడుకి సంబంధించి 12 రోజులు షూటింగ్ ఉందని కథానాయకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. అయితే ఇంతవరకు ఆ షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా జరుగుతూనే ఉంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో బ్రేకులు పడ‌డం వ‌ల్ల షూటింగ్ ఆల‌స్యం అవుతోంది. కొన్ని భారీ సీన్స్ జనాల మధ్య తీయాల్సిఉంది. కానీ వాటిని బ‌డ్జెట్ త‌గ్గించాలన్న ఉద్దేశ్యంతోనో, తొంద‌ర‌గా చుట్టేయాల‌న్న ఆలోచ‌న‌తోనో పైపైనే కానిచ్చేస్తున్నారట.

కథానాయకుడు రిజల్ట్ మహానాయకుడుపై భారీగా పడినట్టు అర్ధం అవుతుంది. ఈ నెలాఖరు వరకు షూటింగ్ జరిగి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ లేదు. మొదటి పార్ట్ కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కే రెండో పార్ట్ ఇవ్వనున్నారు.

Sponsored links

Again NTR Mahanayakudu Release Date Postponed:

Doubts on NTR Mahanayakudu Movie Release

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019