Advertisementt

డైరెక్టరే.. రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేశాడు

Sat 22nd Dec 2018 08:54 PM
vikram k kumar,nani,rumours,condemned,jersey movie,new gossips  డైరెక్టరే.. రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేశాడు
Director Condemned Rumours about Nani డైరెక్టరే.. రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేశాడు
Advertisement
Ads by CJ

మొన్నటివరకు మినిమం గ్యారంటీ‌ హీరోగా పేరున్న నాని గత రెండు మూడు చిత్రాల నుంచి ఆ పేరుకు న్యాయం చేయలేకపోతున్నాడు. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాని. కొత్త డైరెక్టర్‌తో ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్నాడు. క్రికెటర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది.

ఇది సెట్స్ మీద ఉండగానే నాని తన తరువాత సినిమాను లైన్‌లో పెట్టేశాడు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఇది అధికారంగా ప్రకటించారు కూడా. ‘జెర్సీ’ తర్వాత విక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నాడు నాని. అందుకు సంబంధించిన పనులను ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో పదే పదే నాని వేలు పెడుతున్నాడని గత కొన్ని రోజులు నుండి వార్తలు వస్తున్నాయి.

ఈ నేపధ్యంలో డైరెక్టర్ విక్రమ్ కుమార్ స్పందిస్తూ.. నాని స్క్రిప్ట్ విషయంలో ఎంత మాత్రం జోక్యం చేసుకోవడం లేదనీ, స్క్రిప్ట్ పనుల్లో నాని ఇన్‌వాల్వ్ అవ్వట్లేదని.. అవ్వన్నీ రూమర్సే అని కొట్టిపారేశాడు. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి పనులు జరుగుతున్నాయనీ, త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని తెలిపాడు.. దీంతో రూమర్స్‌కి చెక్ పడినట్లయింది.

Director Condemned Rumours about Nani :

Nani Not Involved Script, says Director Vikram K Kumar

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ