భానుమ‌తి మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తుందా?

can sai pallavi repeat magic again

Tue 18th Dec 2018 12:10 PM
sai pallavi,sharwanand,hanu raghavapudi,padi padi leche manasu,fida,maari 2,shekhar kammula,kanam,  భానుమ‌తి మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తుందా?
can sai pallavi repeat magic again భానుమ‌తి మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తుందా?
Advertisement

మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్‌ `ప్రేమ‌మ్‌` చూసేంత వ‌ర‌కు సాయి ప‌ల్ల‌వి టాలెంట్ గురించి ఎవ‌రికీ తెలియ‌లేదు. అది కొంత మందికే  అనుకోండి. ఆ త‌రువాత సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల త‌న‌ని తాను నిల‌బెట్టుకోవ‌డం కోసం చేసిన `ఫిదా` త‌రువాత సాయి ప‌ల్ల‌వి ఎంత టాలెంటెడో మ‌న జ‌నాలకే కాదు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కూ తెలిసిపోయింది. భానుమ‌తి ఒక్క‌టే పీస్ హైబ్రీడ్ పిల్లా.. రెండు కులాలు..రెండు మ‌తాలు అంటూ శేఖ‌ర్ క‌మ్ముల కెరీర్‌ని గాడిలో పెట్టిన ఈ త‌మిళ చిన్న‌ది భానుమ‌తిగా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేసుకుంది. 

తెలుగులో హీరోలు కూడా త‌మ షెడ్యూల్ ని ఆమెకు అనుకూలంగా మార్చుకునే స్థాయి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి రూపొందిస్తున్న రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`లో న‌టిస్తోంది. `ఫిదా`లో భానుమ‌తిగా ఫిదా చేసిన సాయి ప‌ల్ల‌వి ఈ సినిమాలో వైశాలిగా క‌నిపించ‌బోతోంది. బెంగాళీ అమ్మాయిగా సాయి ప‌ల్ల‌వి న‌ట‌నపైనే ఈ సినిమా ఫ‌లితం ఆధార‌ప‌డి వున్న‌ట్లు తెలుస్తోంది. దీనికితోడు ధ‌నుష్‌తో ఆమె న‌టించిన త‌మిళ చిత్రం `మారి-2` కూడా `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` విడుద‌ల‌వుతున్న 21నే తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌వుతోంది. 

ఈ రెండు సినిమాల‌కు సేలింగ్ పాయింట్ సాయి ప‌ల్ల‌వే కావ‌డం విశేషం. `మారి-2`లో మాసీవ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఆమె `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు`లో మాత్రం బెంగాళీ చిన్న‌దిగా అల‌రించ‌బోతోంది. ఇటీవ‌ల `క‌ణం`తో తొలి ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన ఈ త‌మిళ సోయ‌గం తాజాగా విడుద‌ల‌వుతున్న ఈ రెండు చిత్రాల‌తో భానుమ‌తి త‌ర‌హాలో రెచ్చిపోయి ఇద్ద‌రు హీరోల్ని గ‌ట్టెక్కిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. 

can sai pallavi repeat magic again:

sai pallavi can repeat the magic


Loading..
Loading..
Loading..
advertisement