అందులో చరణ్ ‘రంగస్థలం’ ప్లేస్ ఎంతో తెలుసా?

Sat 15th Dec 2018 12:07 AM
ram charan,rangasthalam,imdb rankings,7th place,mahanati,tamil movies  అందులో చరణ్ ‘రంగస్థలం’ ప్లేస్ ఎంతో తెలుసా?
Mahanati beats Ram Charan Rangasthalam అందులో చరణ్ ‘రంగస్థలం’ ప్లేస్ ఎంతో తెలుసా?
Sponsored links

ఇంటర్నేషనల్ ఫిలిం డేటా బేస్ (ఐఎండీబీ) 2018 ఏడాదికి గాను టాప్ 10 మూవీస్ లిస్ట్‌ని విడుదల చేసింది. ఇంటర్నేషనల్ ఫిలిం డేటా బేస్.. ప్రతి సంవత్సరం విడుదలవుతున్న కొత్త సినిమాల ఎలా ఉన్నాయో.. అనేది ప్రేక్షకులు ఇచ్చే ఫీడ్ బ్యాక్‌తో ఈ సంస్థ అన్ని భాషల సినిమాలను పరిగణనలోకి తీసుకుని మరీ టాప్ టెన్ ర్యాంక్స్ ఇస్తుంది. ఈ ఏడాది ఆ టాప్ 10 ర్యాంక్స్‌లో తెలుగు నుండి రెండు సినిమాలు, తమిళంనుండి రెండు సినిమాలు, బాలీవుడ్ నుండి ఆరు సినిమాలు టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తెలుగులో ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన మహానటి, రంగస్థలం ఐఎండీబీ టాప్ 10 లో నిలవగా, తమిళం నుండి రాక్షసన్, 96 సినిమాలు ఈ ఐఎండీబీ టాప్ 10‌లో నిలిచాయి. ఇక బాలీవుడ్ నుండి అంధాదున్, బడాయిహో, ప్యాడ్ మ్యాన్, స్త్రీ, రాజీ, సంజు చిత్రాలు టాప్ 10 జాబితాలో టాప్ లిస్ట్‌లో నిలిచాయి.

ఇక తెలుగు నుండి టాప్ 10 లో మహానటి నాలుగో స్థానంలోనూ, రామ్ చరణ్ రంగస్థలం 7‌వ స్థానంలోనూ నిలిచాయి. దీన్నిబట్టి ఈ ఏడాది ప్రేక్షకులు గట్టిగా మెచ్చిన చిత్రం మహానటి అని రుజువైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవిత కథగా తెరకెక్కిన ఈ మీడియం బడ్జెట్ చిత్రం సూపర్ హిట్ కలెక్షన్స్‌తో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నెంబర్‌వన్ గా నిలిచింది. అయితే ఇలా ప్రేక్షకులు మెచ్చిన చిత్రాల్లో రంగస్థలాన్ని దాటి మహానటి ముందుకెళ్ళిపోయింది. అంటే రామ్ చరణ్ రంగస్థలం కన్నా ఎక్కువగా ప్రేక్షకులు మహానటినే ఆదరించారు.

ఇక తమిళనాట రాక్షసాన్ టాప్‌లో రెండవ స్థానంలోనూ, త్రిష 96 టాప్ 3 లో నిలిచాయి. ఇక ఈఏడాది ఐఎండీబీ టాప్ 1 లో బాలీవుడ్ మూవీ అంధాదున్ ఉంది. 

Sponsored links

Mahanati beats Ram Charan Rangasthalam:

Ram Charan Rangasthalma got 7th Place in IMDB Rankings

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019