రాజమౌళి పిలిచాడు.. అంతా సిద్ధమేనా?

Sat 08th Dec 2018 08:51 AM
ss rajamouli,telangana,rrr,shooting update,ram charan,jr ntr,rrr movie,telangana elections 2018  రాజమౌళి పిలిచాడు.. అంతా సిద్ధమేనా?
Rajamouli gives update on RRR movie రాజమౌళి పిలిచాడు.. అంతా సిద్ధమేనా?
Sponsored links

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ఓ భారీ మల్టీ స్టారర్‌కి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ - ఎన్టీఆర్‌లను హీరో - విలన్‌గా పెట్టి ఓ సినిమా ప్లాన్ చేసి గత నెల 19 నుండి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. రాజమౌళి సినిమాలంటే కచ్చితంగా ఏడాది పైనే పడుతుందని అందరికి తెలిసిన విషయమే. ఎక్కడా. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా తీసే రాజమౌళి RRR ఫస్ట్ షెడ్యూల్‌ను అప్పుడే కంప్లీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

కేవలం 17 రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేయడంతో ఎవరికీ అర్ధం కాక షాక్‌లో ఉన్నారు. మొదట షెడ్యూల్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లపై ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని హైదరాబాద్ శివారులో వేసిన సెట్‌లో చిత్రీకరించారు. అయితే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని రాజమౌళి ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. మరి ఫస్ట్ షెడ్యూల్ కింద ఫైట్ సీక్వెన్స్ ఒక్కటే ప్లాన్ చేశాడా? లేదా కొన్ని సీన్స్ కూడా షూట్ చేశాడా అన్న విషయాలు‌పై క్లారిటీ లేదు.

RRR ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని...ఇప్పుడు నా ఓటు హక్కు ను వినియోగించుకునేందుకు వెళుతున్నానని.. మీరు కూడా కూడా ఓటు వేయాలని ట్విట్టర్ వేదికగా కోరారు రాజమౌళి. మరి మీరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా ? ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మన భవిష్యత్తు నిర్మాణం కోసం ఈ గౌరవాన్ని స్వీకరిద్దాం. ఖచ్చితంగా అంతా ఓటు వేయండి.. అని రాజమౌళి ట్విట్టర్‌ ద్వారా పిలుపునిచ్చారు. ఓటు వేసిన అనంతరం.. నా కర్తవ్యాన్ని పూర్తి చేశా.. మరి మీరు? అంటూ మరోసారి జక్కన్న తన ట్విట్టర్ ద్వారా తను ఓటు వేసిన ఫొటోను షేర్ చేశారు.

Sponsored links

Rajamouli gives update on RRR movie:

Rajamouli Tweet on Telangana Elections

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019