పూరీని గ‌ట్టెక్కించే మొన‌గాడు ఎవ‌రో?

Sat 08th Dec 2018 07:04 AM
puri jagannath,puri,vijay devarakonda,akash puri,charmi,deverakonda,ram,  పూరీని గ‌ట్టెక్కించే మొన‌గాడు ఎవ‌రో?
who save puri jagannath పూరీని గ‌ట్టెక్కించే మొన‌గాడు ఎవ‌రో?
Sponsored links

టాలీవుడ్‌లో డాషింగ్ డైరెక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్న పూరిజ‌గ‌న్నాధ్ ప్ర‌స్తుతం త‌న ఉనికిని కాపాడుకునే ప‌నిలోప‌డ్డాడు. క్రేజీ హీరోల‌కు ల్యాండ్ మార్క్‌ హిట్‌లు అందించిన పూరీ ఇప్పుడు త‌న‌కు హిట్టిచ్చే నాధుడి కోసం ఎదురుచూస్తున్నాడు. క్ష‌ణం తీరిక లేకుండా వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో స్టార్ డైరెక్ట‌ర్‌గా ఓ వెలుగు వెలిగిన పూరితో సినిమా చేయాలంటే స్టార్ హీరోలే కాదు చిన్న హీరోలు కూడా భ‌యంతో జంకుతున్నార‌ట‌. త‌న‌దైన మార్కు మాస్ సినిమాల‌తో ఓ ద‌శ‌లో చెల‌రేగిపోయిన పూరీ ఇప్ప‌డు గోళ్లు గిళ్లు కుంటున్నాడు. గ‌త కొంత కాలంగా పూరీకి క‌లిసి రావ‌డం లేదు. ఛార్మీ అత‌ని కాంపౌండ్‌లోకి చేరిన ద‌గ్గ‌రి నుంచే పూరీ పూర్తిగా దివాలా తీశాడ‌నే వాద‌న కూడా వుంది. 

ఒక్క హిట్టుకొట్టి అంద‌రి నోళ్లు మూయించాల‌ని కొడుకు ఆకాష్‌తో చేసిన ప్ర‌య‌త్నం కూడా వృధా కావ‌డం పూరీ కెరీర్‌ను మ‌రింత ఇర‌కాటంలో ప‌డేసింది. దీంతో పెద్ద హీరోలెవ‌రూ అత‌నితో సినిమా చేయ‌డానికి సాహ‌సించ‌లేక ముఖం చాటేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుత స్థితి నుంచి త‌న‌ని, త‌న కెరీర్‌ని కాపాడే హీరో కోసం వెతుకుతున్నపూరీ క‌న్ను తాజా సంచ‌ల‌నం విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ప‌డింద‌ట‌. త‌క్కువ టైమ్‌లోనే టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా వెలిగిపోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ తో ఓ సినిమా చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్టు కొట్టాల‌ని పూరీ ఆశ‌గా ఎదురుచూస్తున్నాడ‌ని, అత‌ని కోసం ప్ర‌త్యేకంగా ఓ స్క్రిప్ట్‌ను కూడా సిద్ధం చేశాడ‌ని చెబ‌తున్నారు. 

వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా వున్న విజ‌య్ దేవ‌ర‌కొండ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీకి ఛాన్సిస్తాడా?  అన్న‌దే ఇప్పుడున్న చిక్కుప్ర‌శ్న‌. పూరీ టాలెంట్ తెలిసిన వాళ్లు మాత్రం విజ‌య్ ని ఒప్పించ‌డం పూరీకి పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని, పూరీ ట్రాక్ ఎక్కితే మ‌ళ్లీ జోరందుకోవ‌డం గ్యారెంటీ అని  చెబుతున్నారు. అన్న‌ట్టు రామ్‌తో పూరిజ‌గ‌న్న‌థ్‌ ఓ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. పూరి త‌న త‌దుప‌రి చిత్రాన్ని రామ్‌తోనే చేస్తాడా?  లేక విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం ఎదురు చూస్తాడా? అన్న‌ది కాల‌మే చెప్పాలి.

Sponsored links

who save puri jagannath:

who save puri jagannath

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019