కౌశల్ మళ్లీ మాయ చేస్తున్నాడు..!

Fri 12th Oct 2018 03:27 PM
bigg boss,kaushal,ridiculous claims,telugu bigg boss season 2,bigg boss winner,pmo  కౌశల్ మళ్లీ మాయ చేస్తున్నాడు..!
Telugu Bigg Boss Season 2 Winner Kaushal’s Ridiculous Claims కౌశల్ మళ్లీ మాయ చేస్తున్నాడు..!
Sponsored links

తన మాటలతో మాయ చేసి..నేను ఒంటరి అనే ఫీలింగ్ తెచ్చి కౌశల్ ఆర్మీ పేరుతో బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యాడు కౌశల్. సినిమాలో అవకాశాలు కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నాడు కౌశల్. రీసెంట్ గా అతను ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో..బిగ్ బాస్ టైటిల్ గెలిచాక తనకో యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వాలని సమాచారం ఇచ్చిందని..వాటికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని చెబుతున్నాడు.

మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ...మరోసారి అటువంటి మాటలే మాట్లాడాడు కౌశల్. లేటెస్ట్ గా అతనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆఫీస్ నుంచి కూడా కాల్ వచ్చిందని షూటింగ్ లో ఉండటం వల్ల నాన్న లిఫ్ట్ చేసి థాంక్స్ చెప్పారని కౌశల్ అనడం మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. అంతటితో ఆగకుండా తనకు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చిందని త్వరలోనే ఆ వివరాలు కూడా తెలుపుతానని అనడం మరో వింత.

అయితే మీకు 40 కోట్ల ఓట్లు ఎలా వచ్చాయి అనే దాని గురించి యాంకర్ ప్రశ్నించినప్పుడు దాటవేత సమాధానం ఇచ్చి తప్పించుకోవడం కొసమెరుపు. అయితే ఆయన చెబుతున్నవన్నీ.. ఆధారాలతో చెప్పుకుంటే బాగుంటుందని సగటు ప్రేక్షకులు చెబుతున్న మాట.

Sponsored links

Telugu Bigg Boss Season 2 Winner Kaushal’s Ridiculous Claims:

Did Kaushal Really Get A Call From PMO

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019