ఈ హీరో చెప్పే రేటుకి షాకవుతున్నారట!

Ira Creations Demands 4 Crs to Narthanasala Satellite Rights

Thu 16th Aug 2018 11:46 AM
naga shourya,narthanasala,satellite rights,demand  ఈ హీరో చెప్పే రేటుకి షాకవుతున్నారట!
Ira Creations Demands 4 Crs to Narthanasala Satellite Rights ఈ హీరో చెప్పే రేటుకి షాకవుతున్నారట!
Advertisement

నాగశౌర్య సినిమాల్లో చెప్పుకోదగ్గవి రెండే రెండు ఒకటి ‘ఊహలు గుసగుసలాడే’,  రెండు ‘ఛలో’. అందులో ముఖ్యంగా నాగశౌర్య ఫేట్ మార్చిన సినిమా ‘ఛలో’. అతనికి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘ఛలో’ సినిమాకు శాటిలైట్ మోస్తరు రేటుకే అమ్ముడుపోయింది. కానీ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ విషయంలో టీవీ ఛానెల్స్ వారికి చుక్కలు చూపిస్తున్నాడట. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కించిన ‘ఛలో’ సినిమా తర్వాత ఇప్పుడు అదే బ్యానర్‌లో ‘నర్తనశాల’ అనే సినిమా చేస్తున్నాడు.

రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో శౌర్య ఈ సినిమా యొక్క శాటిలైట్ రేట్ ను అమాంతంగా పెంచేశాడట. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కొనాలని ఎవరు వచ్చిన వారికి భారీ రేట్లు చెప్పుతున్నాడట. ఏకంగా 4కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడట. తన గత చిత్రాలు 4కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తోనే పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి.

అలాంటిది ‘నర్తనశాల’కు కేవలం శాటిలైట్ రైట్స్‌కే ఇంత మొత్తం చెప్పడం ఛానెల్స్ వారు ఖంగుతింటున్నారట. ‘ఛలో’ సినిమా తర్వాత శౌర్య కి వరసగా రెండు డిజాస్టర్స్ వచ్చాయి. అయినా కానీ ‘ఛలో’ సినిమానే దృష్టిలో పెట్టుకుని ఇంతలా రేట్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి అంత రేట్‌కి ఏ ఛానల్ వాళ్లు వచ్చి ధైర్యం చేసి ఈ సినిమాను తీసుకుంటారో చూడాలి.

Ira Creations Demands 4 Crs to Narthanasala Satellite Rights:

Naga Shourya Ira Creations Seocnd Movie @Narthanasala


Loading..
Loading..
Loading..
advertisement