తరుణ్ భాస్కర్ ఒప్పేసుకున్నాడు..!

Fri 06th Jul 2018 10:34 PM
tharun bhascker,star heroes,media,damage control,ee nagaraniki emaindi  తరుణ్ భాస్కర్ ఒప్పేసుకున్నాడు..!
Tharun Bhascker In Damage Control Mode తరుణ్ భాస్కర్ ఒప్పేసుకున్నాడు..!
Sponsored links

పెళ్లి చూపులతో డీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్..తాజా చిత్రం ఈ నగరానికి ఏమైంది సినిమా మాత్రం సో సో టాక్ తో రన్ అవుతుంది. పెళ్లి చూపులు సినిమాతో కొత్త నటీనటులను తీసుకున్నట్టుగానే తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది సినిమాలో కూడా అందరిని కొత్తవాళ్ళనే తీసుకున్నాడు. అయితే సినిమాలో అందరికీ కనెక్ట్ అయ్యే కథ లేకపోవడంతో... కేవలం యూత్ నుండి యావరేజ్ మార్కులు వేయించుకుంది. అయితే తరుణ్ భాస్కర్ తన సినిమా యావరేజ్ అంటే కాస్త మండిపడినప్పటికీ.. తర్వాత కూల్ అయ్యి తన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

తరుణ్ భాస్కర్ ఇలా కొత్త నటీనటులను తీసుకోవడానికి గల కారణం పై తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బయటపెట్టాడు. నేను పెద్ద హీరోలను అప్పుడే పర్ఫెక్ట్ గా డీల్ చెయ్యలేను. ఇప్పటికే స్టార్స్ ని డీల్ చెయ్యలేను అనే రూమర్ నా మీద ఉంది. అది నిజంగా నిజమే. నాకు కేవలం పెళ్లి చూపులు సినిమాతో మంచి ఛాన్సెస్ వచ్చాయి. అలాగే పెద్ద హీరోలతోనూ ఛాన్స్ వచ్చినప్పటికీ వాళ్లతో ఏదో ఒక కథతో సినిమా తీసెయ్యలేను. అలా తీసి వాళ్ళ ఇమేజ్ ని డ్యామేజ్ చెయ్యలేను. 

ఇక పెళ్లి చూపులు తర్వాత తమిళం, హిందీ నుండి వచ్చిన ఛాన్స్ లను కూడా సురేష్ ప్రొడక్షన్ తో కమిట్ అవడం వలనే వదిలేసానని... ఇక పెద్ద హీరోలతో సినిమా తియ్యడానికి తగిన అనుభవం లేని నేను కొత్త నటీనటులతో ఈ నగరానికి ఏమైంది సినిమా చేశానని చెప్పుకొచ్చాడు. అలాగే స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యాలంటే సినిమాల్లో ఇంకా పట్టు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తన మీద వస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసాడు తరుణ్ భాస్కర్.

Sponsored links

Tharun Bhascker In Damage Control Mode:

>Tharun Bhascker Patches With Media

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019