Advertisement

మొండివాడైన బాలయ్యను క్రిష్ ఒప్పించాడా!

Fri 06th Jul 2018 09:01 PM
  మొండివాడైన బాలయ్యను క్రిష్ ఒప్పించాడా!
Nandamuri Mokshagna To Act In NTR Biopic? మొండివాడైన బాలయ్యను క్రిష్ ఒప్పించాడా!
Advertisement

నిజానికి స్వర్గీయ ఎన్టీఆర్‌ తనయులైన బాలకృష్ణ, హరికృష్ణల తెరంగేట్రం ఎన్టీఆర్‌ దర్శకత్వంలో ఆయన చిత్రాల ద్వారానే జరిగింది. అదే విధంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ రంగప్రవేశం కూడా తన తాతయ్య చిత్రం ద్వారానే మొదలైంది. ఇప్పుడు నందమూరి అభిమానులు కూడా బాలకృష్ణ తనయుడు, నందమూరి బాలకృష్ణ వారసునిగా అందరూ భావిస్తున్న నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కూడా తన తండ్రి చిత్రం ద్వారా, అందునా తన తాతయ్య బయోపిక్‌ ద్వారా జరగాలని ఎంతో కాలంగా కోరుకుంటున్నారు. కానీ బాలయ్య ఎందుకో ఈ విషయంలో పాజిటివ్‌గా లేడు. 

ఇక బాలకృష్ణ నటిస్తు క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. ఈ చిత్రంలో యంగ్‌ ఎన్టీఆర్‌ పాత్రను శర్వానంద్‌ చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ నందమూరి అభిమానులు మనసు గ్రహించిన క్రిష్‌ మాత్రం ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఆయన యంగ్‌ పాత్రను నందమూరి మోక్షజ్ఞ చేస్తేనే అభిమానులు సంతోషిస్తారని భావించాడు. అంతేకాదు.. ఎంతో మొండివాడైన బాలయ్యను అందుకు క్రిష్‌ ఒప్పించాడనే వార్త ఇప్పుడు నందమూరి అభిమానులలో ఎనలేని సంతోషాన్ని నింపుతోంది. ఈ చిత్రంలో మోక్షజ్ఞ నటించాల్సిందేనని, ఈ చిత్రం ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వాలని క్రిష్‌ బాలయ్యను ఒప్పించాడట. ఇ

క మోక్షజ్ఞ ఇప్పుడు కాస్త బొద్దుగా ఉన్నాడు. కానీ ఆ పాత్ర కోసం మోక్షజ్ఞను బరువు తగ్గాలని క్రిష్‌ సూచించడంతో బరువు తగ్గే పనిలో భాగంగా మోక్షజ్ఞ సింగపూర్‌కి వెళ్లాడని అంటున్నారు. దీనికి బాలయ్య కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. మరోవైపు ఈ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ తప్ప మిగిలిన నందమూరి హీరోలైన హరికృష్ణ, కళ్యాణ్‌రామ్‌, తారకరత్నవంటి అందరు నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని చరిత్రలో నిలిచిపోయే కళాఖండంగా తీర్చిదిద్దాలని బాలయ్య, క్రిష్‌లు భారీ కసరత్తులు చేస్తున్నారు. వచ్చేసంక్రాంతికి ఎన్టీఆర్‌ బయోపిక్‌ని ఎలాగైన ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఈ చిత్రంపైనే ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

Nandamuri Mokshagna To Act In NTR Biopic?:

Mokshagna Special Role In NTR Biopic?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement