Advertisement

'కులరచ్చ'లో చిక్కుకున్నాడు...!

Wed 04th Jul 2018 07:54 PM
kamal haasan,twitter,against caste,shruti haasan,caste problems  'కులరచ్చ'లో చిక్కుకున్నాడు...!
Kamal Haasan Criticised Over Caste Stand 'కులరచ్చ'లో చిక్కుకున్నాడు...!
Advertisement

కులం, మతం, ప్రాంతీయతత్వం అనేవి మనిషి నుంచి మనిషికి మారుతూ ఉంటాయి. ఆయా వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఎవరైనా నడుచుకుంటూ ఉంటారు. అభ్యుదయ భావాలు మనలో ఉంటే సరిపోదు.. వాటిని కష్టసాధ్యమైనా సరే ఎదుర్కోవాలి. నిజానికి బ్రాహ్మణులే పాతకాలంలో కులాలను రెచ్చగొట్టారనే ఆరోపణ తరచు వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బ్రాహ్మనిజం అంతంకానిదే కులరహిత సమాజం సాధ్యంకాదని కొందరు నమ్ముతారు. ముఖ్యంగా తమిళనాట డీఎంకే వంటి పార్టీలలో ఇదే వారి సిద్దాంతం. ఇక నిజానికి బ్రాహ్మణులే కులాలను రెచ్చగొట్టారనేది కూడా నిజంకాదు. చరిత్ర తీసుకుంటే ప్రతి బ్రాహ్మణుడు ఆ ఊరి పెద్ద అయిన రెడ్డి, చౌదరి, నాయుడు, రాజు వంటి వారి వద్ద పనిచేసిన వారే గానీ అసలు సూత్రధారులు మాత్రం బ్రాహ్మణులు కాదు. కులరహిత సమాజాన్ని కోరుకునే వామపక్ష భావజాలం కలిగిన ఎందరో బ్రాహ్మణులే పాత కాలంలో కమ్యూనిజాన్ని శక్తివంతంగా  మార్చి తమ ఆస్ధులను కూడా ఇతరులకు రాసిచ్చారు. శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి వారే సహపంక్తి భోజనాలను ప్రోత్సహించి ఉన్నదంతా పోగొట్టుకున్నారు. 

ఇక విషయానికి వస్తే కమల్‌హాసన్‌ స్వతహాగా బ్రాహ్మణుడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, నేను వేసుకునే జంధ్యం నాకు ఇబ్బందులను కలిగించింది. అందుకే దానిని తీసివేశాను అని చెప్పాడు. కానీ తన గొప్పతనం గురించి నిజమైన గొప్పవాడు ఎప్పుడు సొంతంగా డబ్బా కొట్టుకోడు. ఇంకా ఈయన మాట్లాడుతూ, నా కూతుర్లను స్కూల్‌లో చేర్పించే సమయంలో కులం, మతం వంటి వాటిని పూర్తి చేయడానికి నేను అంగీకరించలేదు. దీని ద్వారానే మన తర్వాతి తరంలో మార్పు తీసుకుని రావచ్చు. కేరళలో ఇప్పటికే ఈ పద్దతిని పాటిస్తున్నారని చెప్పుకొచ్చాడు. కానీ కొంత కాలం కిందట కమల్‌ రామాయణం, భారతం, భగవద్గీత వంటి వాటిపై విమర్శలు చేస్తూ నేను బ్రాహ్మణుడిని అయినా కూడా ప్రపంచంలోని అన్ని జంతుల మాంసాన్ని తిన్నాను.. అని గొప్పగా చెప్పుకున్నాడు. 

కేవలం మాంసాహారం తినడమే బ్రాహ్మణ వ్యతిరేకతకు ఎలా ఆదర్శం అవుతుందో ఆయనకే తెలియాలి. ఇక ఆయన కూతురు శృతిహాసన్‌ ఓసారి మాట్లాడుతూ, మాది సాంప్రదాయ బ్రాహ్మణకుటుంబం.. మేమువైష్ణవులం అని తెలిపింది. దీంతో కమల్‌ తాజా వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ కూతురు తన కులం గురించి అవసరం లేకపోయినా ప్రస్తావించింది. ముందు నీ ఇంటి నుంచి మార్పు తీసుకుని రమ్మని కమల్‌ని పలువురు ఘాటుగా విమర్శిస్తున్నారు. అసలు బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన ఎవరైనా బ్రాహ్మణులే అవుతారనే విషయాన్నికమల్‌ విస్మరించిడం సరికాదు. 

Kamal Haasan Criticised Over Caste Stand:

Kamal Haasan trolled on Twitter over stand against caste

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement