‘అరవింద సమేత’ వెనుక కహాని ఏంటో?

Wed 04th Jul 2018 10:45 PM
aravinda sametha,meaning,title,jr ntr,trivikram srinivas  ‘అరవింద సమేత’ వెనుక కహాని ఏంటో?
Story Behind Aravinda Sametha Title ‘అరవింద సమేత’ వెనుక కహాని ఏంటో?
Sponsored links

ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘అరవింద సమేత’ సెట్స్ పై వుంది. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్ అవ్వబోతోంది. అయితే ఈ టైటిల్ వెనుక  బోలెడంత క్యూరియాసిటీ నడుస్తుంది. ఈ సినిమా టైటిల్ బట్టి ఈ సినిమా స్టోరీ ఏంటో అని ఆ లాజిక్ ను ఛేదించే పనిలో పడ్డారు ఫ్యాన్స్.

అరవింద అనేది సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే పాత్ర పేరని, వీర రాఘవ అనేది ఎన్టీఆర్ పాత్ర పేరని అన్నారు. మరి కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి అరవింద అనేది ఎన్టీఆర్ సాఫ్ట్ క్యారెక్టర్ పేరని.. వీరరాఘవ అనేది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఎన్టీఆర్ యొక్క మాస్ షేడ్ అని విశ్లేషణ ఇచ్చారు. అయితే టైటిల్ రహస్యం అది కూడా కాదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు.

దాంతో ఫ్యాన్స్ మరోసారి ఈ టైటిల్ వెనుక వున్న లాజిక్ ను ఛేదించే పని మొదలుపెట్టారు. అయితే ఆ లాజిక్ ఏంటో తెలియాలంటే త్రివిక్రమ్, ఎన్టీఆర్ లేదా నిర్మాత.. వీరిలో ఎవరో ఒకరు చిన్న హింట్ ఇవ్వాలి. కానీ వాళ్లు ఇప్పట్లో హింట్ మాత్రం ఇవ్వరు. ఎందుకంటే అలా చేస్తే సినిమాపై క్యూరియాసిటీ పోతుంది. సో.. టైటిల్ కహాని తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయక తప్పదు.

Sponsored links

Story Behind Aravinda Sametha Title:

>Aravinda Sametha Wild Guesses on Title

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019