ఎన్టీఆర్‌కి వాచ్ గిఫ్ట్ కహానీ ఇదేనా?

Sat 09th Jun 2018 09:06 AM
kalyan ram,jr ntr,birthday,watch gift  ఎన్టీఆర్‌కి వాచ్ గిఫ్ట్ కహానీ ఇదేనా?
This is the Real story behind the Kalyan Ram Watch Gift ఎన్టీఆర్‌కి వాచ్ గిఫ్ట్ కహానీ ఇదేనా?
Sponsored links

ఎన్టీఆర్ రీసెంట్ గా తన పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు మనకి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రూపంలో గిఫ్ట్ ఇస్తే.. ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్..తారక్ కు ఓ ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ వాచ్ గురించి మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కళ్యాణ్ రామ్ ఫారిన్ నుంచి స్పెషల్ గా తెప్పించి మరీ ఈ వాచ్ ను ఎన్టీఆర్ కు బహూకరించాడని అన్నారు.

ఆ వాచ్ రేట్ కూడా కోటి రూపాయలు పైనే అని మీడియాలో చాలా రోజులు వరకు వార్తలు వచ్చాయి. అయితే వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిసింది. వాచ్ ఇచ్చిన మాట మాత్రం వాస్తవం కానీ దాని ఖరీదు కోటి రూపాయిలు కాదట. అదీకాక ఆ వాచ్ ను ఫారిన్ నుంచి ఏమి తెపించింది కాదంట. హైదరాబాద్ లోనే కొన్నదంట.

కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఓ లగ్జరీ వాచ్ షోరూంలో చాలా సేపు షాపింగ్ చేసిన కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ కోసం అక్కడ ఉన్న వాచీలలో ఖరీదైనది కొని గిఫ్ట్ ఇచ్చాడట. అయితే దాని రేట్ కోటి మాత్రం కాదంట.. కానీ రేట్ మాత్రం ఎక్కువే అని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ అన్నదమ్ముల బాండింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకోవటమే కాకుండా నందమూరి ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Sponsored links

This is the Real story behind the Kalyan Ram Watch Gift:

Facts behind Kalyan Ram's Watch Gift to NTR

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019