ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aditi Rao Hydari Latest Pic Sensation in Social Media

అబ్బ.. ఏముందిరా ఈ హీరోయిన్?

బాలీవుడ్ లో అదితి రావు అంటే తెలియని వారుండరు. ఎందుకంటే అదితికి బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు రాకపోయినప్పటికీ.. ఎప్పుడూ అవార్డు ఫంక్షన్స్, ప్రీమియర్ షోస్ కి, అలాగే పార్టీస్ కి అందమైన డ్రెస్సులు వేసుకుని ఎప్పుడూ హల్చల్ చేసే అదితి రావు ఈ మధ్యన సౌత్ సినిమాల్లో తెగ హల్చల్ చేస్తుంది. అమ్మాయిది హైదరాబాద్ అయినప్పటికీ.. ఎప్పుడో బాలీవుడ్ కి చెక్కేసింది. అయితే మొన్నామధ్యన మణిరత్నం చెలియా సినిమాతో సౌత్ లో కాలు పెట్టిన అదితికి ఆ సినిమా నిరుత్సాహ పరిచింది. కానీ అదితి బాలీవుడ్ లో నటించిన పద్మావత్ సినిమా హిట్ అయ్యింది. అందులో అదితి అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే రణ్వీర్ సింగ్ కి భార్యగా నటించి  అదరగొట్టింది.

తాజాగా అదితి రావు తెలుగులో సుధీర్ బాబుకి జోడీగా సమ్మోహనం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో అదితి చాలా అందంగా కనబడుతుంది. తాజాగా వచ్చిన సమ్మోహనం ట్రైలర్ లో అదితి రావు హైలైట్ గా వుంది. అయితే ఎప్పుడూ ట్రెడిషన్ గా కనబడే అదితి రావు ఇప్పుడు ఒక లెవల్లో అందాలు ఆరబొయ్యడానికి రెడీ అయ్యింది. ఎప్పుడూ అంత అందమైన గ్లామర్ అదితిని మనం చూసుండం. అయితే తాజాగా అదితి తాను గ్లామర్ పాత్రలకు సై అనే మెస్సేజ్ ని సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో పాటుగా పాస్ చేసింది. అదితి రావు వైట్ బికినీలో చేస్తున్న ఆ గ్లామర్ షో ఫోటో వైరల్ అయ్యింది.

ఎంతో హాట్ గా బికినీ అంటేనే హాట్ అనుకోండి.. అయినా అదితి మత్తెక్కించే చూపులతో... అలా బికినీతో నుంచుంటే అందరూ.. అబ్బా ఎంత అందం.. ఇప్పటి వరకు ఎక్కడుంది అంటూ లొట్టలేసుకుంటున్నారు. మరి నిజంగానే అదితి రావు ఆ తెల్లని బికినిలో పాలరాతి బొమ్మలా మెరిసిపోతూ... చూపరుల మతులు పోగొడుతుంది. మరి అదితి అందాలు చూసిన ఎవ్వరైనా అబ్బా అదితి కత్తిలా వచ్చేస్తుందిగా అంటున్నారు. మరి సౌత్ తో పాటు అమ్మడు బాలీవుడ్ మీద గట్టిగా కన్నేసినట్టుగానే కనబడుతుంది...ఈ ఫొటోలోని అదితి వాలకం చూస్తుంటే.. చూద్దాం ఈ గ్లామర్ షో అదితిని ఎక్కడికి తీసుకెళుతుందో అనేది.

Praises on Aditi Rao Hydari Glamour Pic

Aditi Rao Hydari Latest Pic Sensation in Social Media
aditi rao hydari
heroine
seminude
latest pic
social media