రవితేజతో ఇద్దరు హీరోయిన్లు రీ ఎంట్రీ!

Tue 22nd May 2018 10:09 AM
ileana,shruti haasan,amar akbar antony,raviteja  రవితేజతో ఇద్దరు హీరోయిన్లు రీ ఎంట్రీ!
Ileana and Shruti Haasan Re Entry with Raviteja Film రవితేజతో ఇద్దరు హీరోయిన్లు రీ ఎంట్రీ!
Sponsored links

వెండితెరపైనే కాదు.. షూటింగ్‌ సమయంలో కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండి.. అందరితో కలిసి పోయే హీరో రవితేజ. అందుకే ఆయనతో ఓ చిత్రం చేసిన వారు మరలా మరలా ఆయనతోనే చేయాలని ఉబలాటపడుతూ ఉంటారు. అంతలా మ్యాజిక్‌ చేస్తాడు మాస్‌మహారాజా. ఇక విషయానికి వస్తే 'బెంగాల్‌టైగర్‌' తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని ఆయన 'రాజా దిగ్రేట్‌' చిత్రం చేసి మంచి హిట్‌ కొట్టాడు. కానీ తర్వాత వచ్చిన 'టచ్‌ చేసి చూడు' చిత్రం డిజాస్టర్‌ అయింది. ఈనెల 25న ఆయన నటించిన 'నేలటిక్కెట్‌' విడుదల కానుంది. 

మరోవైపు ఆయన శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రిమూవీమేకర్స్‌ పతాకంపై శ్రీనువైట్లకు లైఫ్‌ అండ్‌ డెత్‌గా చెప్పుకోదగిన 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' చిత్రంలో ఆయన నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం భారీ క్యాస్టింగ్‌నే తీసుకుంటూ ఉన్నారు. ఇక ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకి అవకాశం ఉంది. ఈ పాత్రలలో ఇప్పటికే అనుఇమ్మాన్యుయేల్‌ పేరు వినిపించింది. కాని ఆమెని ఈ చిత్రం నుంచి బయట పెట్టారు. జులాయి తర్వాత తెలుగు తెరపై కనిపించని గోవా బ్యూటీ ఇలియానాని భారీ పారితోషికం ఆఫర్‌ చేసి ఓకే చేయించుకున్నారు. ఇక మరో హీరోయిన్‌గా శృతిహాసన్‌ని తీసుకున్నారని సమాచారం. 'కాటమరాయుడు' తర్వాత శృతి మరో చిత్రం చేయలేదు. 

ఇక ఇలియానా విషయానికి వస్తే ఆమె 'జులాయి'. దాని ముందు రవితేజతో పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో 'దేవుడు చేసిన మనుషులు' చిత్రాలలో నటించింది. మొత్తానికి ఈ హీరోయిన్ల ఎంపికతో ఈ సినిమాపై మంచిక్రేజ్‌ ఏర్పడింది. మరి ఈ అవకాశాన్ని శ్రీనువైట్ల ఎలా సద్వినియోగం చేసుకుంటాడో వేచిచూడాల్సివుంది....! 

Sponsored links

Ileana and Shruti Haasan Re Entry with Raviteja Film:

Ileana and Shruti Haasan in Amar Akbar Antony

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019