Advertisement

'అరవింద సమేత' లుక్‌ మాస్‌.. టైటిల్‌ క్లాస్‌!

Tue 22nd May 2018 09:54 AM
jr ntr,trivikram srinivas,aravinda sametha,a sentiment  'అరవింద సమేత' లుక్‌ మాస్‌.. టైటిల్‌ క్లాస్‌!
Aravinda Sametha- Title Class and Look Mass 'అరవింద సమేత' లుక్‌ మాస్‌.. టైటిల్‌ క్లాస్‌!
Advertisement

'అజ్ఞాతవాసి' తర్వాత త్రివిక్రమ్‌పై వచ్చిన విమర్శలు బహుశా ఆయన కెరీర్‌లో 'ఖలేజా' వంటి ఫ్లాప్‌ ఇచ్చినప్పుడు కూడా వచ్చి ఉండవు. అసలు ఈ చిత్రానికి త్రివిక్రమే పనిచేశాడా? ఆయన పేరు వాడుకుని మరోకరు డైరెక్ట్‌ చేసి, సంభాషణలు రాశారా? అనే అనుమానం కూడా వచ్చింది. ఇక త్రివిక్రమ్ తోపాటు ఆయనతో వరసగా చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాత రాధాకృష్ణ తమ హారిక అండ్‌ హాసిని బేనర్‌పై 'అజ్ఞాతవాసి' తర్వాత ఎన్టీఆర్‌ చిత్రాన్ని తీస్తున్నారు. ఇక ఈ చిత్రానికి 'అసామాన్యుడు' అనే టైటిల్‌ని అనుకుంటే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి ఆ టైటిల్‌ నచ్చలేదు. దీనికి మరో కారణం ఏమిటంటే 'అజ్ఞాతవాసి' కూడా 'అ'తోనే స్టార్ట్‌ కావడం. 

ఇక తాజాగా ఈ చిత్రంలోని ఎన్టీఆర్‌ లుక్‌ని, టైటిల్‌ని కూడా ప్రకటించారు. ఎప్పుడో 'టెంపర్‌' చిత్రంలో సిక్స్‌ ప్యాక్‌ చూపించిన ఎన్టీఆర్‌ మరలా ఇంత గ్యాప్‌ తర్వాత చొక్కా లేకుండా సిక్స్‌ప్యాక్‌లో అదరగొడుతున్నాడు. ఇక చేతిలో కొడవలి వంటి కత్తి పట్టి అగ్రెసివ్‌గా కనిపిస్తూ ఉన్నాడు. ఈ లుక్‌ని చూస్తే ఈ చిత్రం రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది అనే వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇక ఈ చిత్రంకి టైటిల్‌గా 'అరవింద సమేత' అనే అక్షరాలు పెద్ద సైజులో ఉండగా, కింద 'వీరరాఘవ'ను జంప్‌ లైన్‌గా ఉంచారు. ఇందులో ఎన్టీఆర్‌ లుక్‌ మాత్రం బ్యాంగ్‌ బ్యాంగ్‌ అంటూ నెవర్‌ బిఫోర్‌ అనేలా ఉంది. 

ఇక త్రివిక్రమ్‌ విషయంలో 'అ' సెంటిమెంట్‌ కేవలం 'అజ్ఞాతవాసి'లోనే ఫ్లాప్‌ అయింది. కానీ 'అ'తో వచ్చిన 'అతడు' చిత్రం దర్శకునిగా త్రివిక్రమ్‌ కెరీర్‌ని మలుపు తిప్పింది. ఆ తర్వాత వచ్చిన 'అ..ఆ' చిత్రం కూడా బాగా ఆడింది. ఇక ఎన్టీఆర్‌కి 'అ' సెంటిమెంట్‌ విషయానికి వస్తే 'ఆది, అదుర్స్‌' చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. కానీ 'ఆంధ్రావాలా, అశోక్‌'లు నిరాశపరిచాయి. మరి ఈ సెంటిమెంట్‌ విషయంలో ఎవరిమాట నిజం అవుతుందో చూడాలంటే సినిమా విడుదలయ్యే దసరా వరకు వెయిట్‌ చేయాల్సివుంది...!

Aravinda Sametha- Title Class and Look Mass:

Aravinda Sametha also A Sentiment

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement