'భరత్‌' నాకు నచ్చాడు: తమన్నా!

Thu 10th May 2018 11:58 AM
tamannah,bharat ane nenu,mahesh babu,naa nuvve  'భరత్‌' నాకు నచ్చాడు: తమన్నా!
Tamannah Watches Mahesh Babu's Bharat Ane Nenu 'భరత్‌' నాకు నచ్చాడు: తమన్నా!
Sponsored links

తెలుగులో పాల బుగ్గల సుందరి, మిల్కీ బ్యూటీ అంటే ఎవరికైనా తమన్నానే గుర్తుకు వస్తుంది. ఈమె కెరీర్‌ అంతా ఒక ఎత్తైతే 'బాహుబలి-ది బిగినింగ్‌'లో ఆమె చేసిన అవంతిక పాత్ర మరో ఎత్తు. ఇక ఈమె గతంలో మహేష్‌బాబుతో కలిసి 'ఆగడు' చిత్రంలో కూడా నటించింది. ఈమె ప్రస్తుతం తెలుగులో యాడ్‌ ఫిల్మ్‌మేకర్‌ జయేంద్ర దర్శకత్వంలో, పి.సి.శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్న నందమూరి కళ్యాణ్‌రామ్‌ 'నా నువ్వే'లో నటిస్తోంది. ఇక ఈమె 'సైరా..నరసింహారెడ్డి'లో కూడా తాను నటించేది నిజమేనని తెలిపింది. 

'నా నువ్వే' విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపిన తమన్నా.. సందీప్‌కిషన్‌తో ఓ ద్విభాషా చిత్రం, దిల్‌రాజు నిర్మాతగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌, మెగా హీరో వరుణ్‌తేజ్‌లతో కలసి రూపొందుతున్న 'ఎఫ్‌2' చిత్రంలో కూడా నటిస్తున్నట్లు కన్‌ఫర్మ్‌ చేసింది. ఇందులో ఆమె వెంకటేష్‌కి జోడీగా నటిస్తుందని సమాచారం. ఇక ఈమె మాట్లాడుతూ, నాకు మహేష్‌బాబు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన నటించిన 'భరత్‌ అనే నేను' చూశాను. ఈ చిత్రం నాకెంతో నచ్చింది అని చెప్పింది. 

ఇక ఈమె నీలకంఠ దర్శకత్వంలో బాలీవుడ్‌ మూవీ 'క్వీన్‌'కి రీమేక్‌గా నటిస్తున్న చిత్రం గురించి మాత్రం మాట్లాడలేదు. ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో నీలకంఠకి ఈమెకి వచ్చిన క్రియేటివ్‌ డిఫరెన్స్‌ల వల్ల ఈ చిత్రం నుంచి డ్రాప్‌ అయిందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం  'అ!' చిత్రం తీసిన ప్రశాంత్‌ వర్మ చేతికి వెళ్లిందని తెలుస్తోంది. మరి దర్శకుడు మారినా కూడా తమన్నా ఆ చిత్రంలో నటిస్తోందో లేదో తెలియడం లేదు. ఇక ఈమె పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్స్‌కి పనిచేయడంతో పాటు పలు షాపుల ప్రారంభోత్సవాలకు కూడా కత్తెర వేస్తోంది. అలా ఆమె ప్రొద్దుటూరులోని బిన్యూ అనే భారీ షాప్‌ ఓపెనింగ్‌ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.

Sponsored links

Tamannah Watches Mahesh Babu's Bharat Ane Nenu:

Tamannah About Bharat Ane Nenu

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019