ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లు, అందునా టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిగా హీరోయిన్ ఈషారెబ్బాని చెప్పుకోవచ్చు. 'అంతకు ముందు ఆ తర్వాత, అమీతుమీ, అ' చిత్రాలతో ఈమె నటనపరంగా ఎంతో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా శ్రియ హీరోయిన్‌గా తీస్తున్న 'ఆటా నాదే వేటా నాదే' చిత్రంలో ఈమె నారా రోహిత్‌కి జంటగా కీలక పాత్రలో నటించనుంది.
ఇక 'అ' చిత్రం గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ చెబుతూ, ఇందులో ఈషారెబ్బాపై ఓ సీన్ ప్లాన్ చేశాం. పెద్ద డైలాగ్స్ ఉన్న ఈ సీన్‌ని సింగిల్‌టేక్‌లో ఓకే చేయాలని భావించాను. అదే విషయం ఈషా రెబ్బాకి చెప్పాను. కానీ సీన్‌లో డైలాగ్ చాలా పెద్దది కావడంతో ఆమె మొదటి టేక్‌లో డైలాగ్ మర్చిపోయింది. రెండో టేకులో కూడా డైలాగ్ సీన్ చెబుతూ, మధ్యలో ఆపేసింది. దాంతో డైలాగ్ మరలా మర్చిపోయిందేమోనని భావించాను. ఆమె డైలాగ్ ఆపేసి ఏడుస్తూ ఉంది. పక్కనే ఉన్న నిత్యామీనన్ ఆమెని ఓదారుస్తూ ఉంది. దాంతో ఈమె ఎందుకు ఏడుస్తుందో అర్ధం కాలేదు. ఎమోషనల్ సీన్ కావడంతో రక్తి కట్టించడానికి ఏడుస్తోందని భావించాను. కానీ ఆమె దగ్గరకు వెళ్లి కనుక్కుంటే పాత్రలో లీనమై పోవడం వల్ల ఆమె అలా ఏడుస్తోందని అర్ధమైంది.
అందుకే ఆ సీన్ ఎంతో సహజంగా వచ్చింది. ఇక 'అ' చిత్రం ముందు నేను ఓ చిత్రం కమిట్ అయ్యాను. జనవరి 1వ తేదీ ఓపెనింగ్. దాంతో స్నేహితులందరికీ పార్టీ ఇస్తున్నాను. ఇంతలో రాత్రి 11.30 నిమిషాలకు ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఓ నిర్మాత డ్రాప్ కావడం వల్ల సినిమా ఆగిపోయిందట. దాంతో రాత్రి 12గంటలకు 'అ' సోర్టీ రాయడం మొదలుపెట్టి వారంలో పూర్తి చేశాను అని చెప్పుకొచ్చాడు.