ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Seerat Kapoor Hopes on Touch Chesi Chudu

ఈ హీరోయిన్ రవితేజనే నమ్ముకుంది!

'రన్ రాజా రన్' సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది సీరత్ కపూర్. ఈ సినిమా తర్వాత చేసింది తక్కువ సినిమాలే అయినా అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో సినిమా ఛాన్సులు కూడా తగ్గిపోయాయి.‘రాజు గారి గది- 2’.. ‘ఒక్క క్షణం’ లాంటి సినిమాల్లో సీరత్ క్యారెక్టర్లు.. ఆమె లుక్స్ ఏమాత్రం జనాల్ని ఆకట్టుకోలేకపోయాయి.

ఇప్పుడు ఆమె దృష్టంతా రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’ మీదే ఉంది. ఈ సినిమాతో మళ్ళీ బ్యాక్ టూ ఫామ్ రావాలని సీరత్ భావిస్తున్నట్లుగా ఉంది. నిన్న రిలీజ్ అయిన ‘రాయే రాయే..’ వీడియో సాంగ్ లో సీరత్ ఆలౌట్ గ్లామర్ అటాక్ మొదలు పెట్టేసినట్లుగా అనిపిస్తోంది.

గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత గ్లామర్ గా.. సెక్సీగా కనిపిస్తోంది ఈ పాటలో.  వరస ఫెయిల్యూర్లతో కెరీర్ ప్రమాదంలో పడ్డ నేపథ్యంలో ‘టచ్ చేసి చూడు’ లాంటి మాస్ సినిమాలో సీరత్ క్లిక్ అయితే మళ్లీ కెరీర్ ఊపందుకుంటుందని సీరత్ భావిస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా రాశిఖన్నా నటిస్తుంది. అయితే రాశి క్యారెక్టర్ చాలా పద్ధతిగా ఉంటుందని సమాచారం. సో ఈ సినిమాలో గ్లామర్ అటాక్ మొత్తం సీరతే చూపించ బోతుందంట. మరి ఈ సినిమా సీరత్ లైఫ్ ని ఎలా టర్న్ చేస్తుందో చూడాలి.

Seerat Kapoor Confident on Ravi Teja Touch Chesi Chudu

Seerat Kapoor Hopes on Touch Chesi Chudu
seerat kapoor
confident
ravi teja
touch chesi chudu