ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sunny Leone enters Madame Tussaud's museum

పోర్న్ స్టార్స్ గురించి పూనమ్‌ చెప్పిందే నిజమైంది!

ఈ దేశంలో సంప్రదాయ మహిళల కంటే పోర్న్‌స్టార్స్‌కే విలువ ఎక్కువగా ఉంటోందని, వారే అందరి కంటే మంచి జీవితం అనుభవిస్తున్నారని ఇటీవల వర్మ, కత్తి మహేష్‌లను ఉద్దేశించి పూనమ్‌కౌర్‌ చేసిన వ్యాఖ్యలు నిజంగానే నిజమవుతున్నాయి. లండన్‌లో ఉన్న టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఇంత కాలం లబ్దప్రతిష్టులైన నరేంద్రమోదీ, అమితాబ్‌బచ్చన్‌, సచిన్‌ టెండూల్కర్‌, కపిల్‌దేవ్‌, హృతిక్‌రోషన్‌, సల్మాన్‌ఖాన్‌, ప్రభాస్‌ వంటి వారి మైనపు విగ్రహాలు ఉన్నాయి.

కాగా టూస్సాడ్స్‌మ్యూజియంవారు ఢిల్లీలో ఏర్పాటు చేయనున్న మ్యూజియంలో పోర్న్‌స్టార్‌ సన్నిలియోన్‌ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇటీవలే ఈ సంస్థ నిర్వాహకులు వచ్చి సన్నిలియోన్‌ శరీర కొలతలతో పాటు ఆమెకి చెందిన 200 కొలతలను కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ మైనపు విగ్రహం పక్కన నిజమైన మనిషి నించున్నా కూడా ఎవరు ఒరిజినల్‌, ఏది విగ్రహం అనేది తెలియనంతగా ఈ విగ్రహాల తయారీ నాణ్యత ఉండనుంది. తన విగ్రహం టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం తనకి ఎంత సంతోషం కలిగించదని, ఎంతో థ్రిల్‌గా ఫీలయ్యానని సన్ని చెప్పింది. టుస్సాడ్స్‌ మ్యూజియం టీమ్‌కి ధన్యవాదాలు తెలిపింది. 

తన ప్రతిరూపాన్ని చూసుకునేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని, ఇది తనకు లభించిన బహుమానంగా ఆమె పేర్కొంది. మొత్తానికి ఏవిధంగా చూసుకున్నా పోర్న్‌స్టార్‌ అయిన సన్ని హవా మన దేశంలో రోజు రోజుకి విపరీతంగా పెరుగుతోందనే చెప్పాలి.

Poonam Kaur Tweet Goes True.

Sunny Leone enters Madame Tussaud's museum
sunny leone
poonam kaur
madame tussauds museum
indo canadian adult star