'సంఘమిత్ర' స్పీడందుకుంది..!

Mon 23rd Oct 2017 11:27 PM
sangamitra,baahubali,publicity,disha patani,sundar c  'సంఘమిత్ర' స్పీడందుకుంది..!
Sangamitra Movie Shooting Updates 'సంఘమిత్ర' స్పీడందుకుంది..!
Sponsored links

తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో 250  కోట్ల భారీ బడ్జెట్ తో 'సంఘమిత్ర' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి మెయిన్ హీరోయిన్ అంటే..'సంఘమిత్ర' రోల్ కి శృతిహాసన్ ని ఎంపిక చెయ్యడం... ఆమెకు యుద్ధ విద్యలు నేర్పించడం... కొన్ని కారణాల వలన శృతి తప్పుకోవడం జరిగిపోయాయి. 'సంఘమిత్ర' ని భారీగా అనౌన్స్ చేసిన తర్వాత శృతి తప్పుకోవడంతో ప్రి ప్రొడక్షన్ పనులతో పాటు హీరోయిన్ ఎంపికలో బిజీగా ఉన్నచిత్ర బృందం ఈ చిత్రానికి లోఫర్ హీరోయిన్ దిశాపటానిని ఎంపిక చేసి అధికారిక ప్రకటన చేశారు.

అయితే 'సంఘమిత్ర' సినిమా సెట్స్ మీదకెళ్ళినప్పటి నుండే.. 'బాహుబలి' రేంజ్ లో ప్రచారానికి చిత్ర బృందం శ్రీకారం చుట్టబోతుంది. 'బాహుబలి' సినిమా మొదలైనప్పటి నుండి ఆ సినిమా పబ్లిసిటీ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో జరిగిందో తెలిసిందే. అలా ఇప్పుడు 'సంఘమిత్ర' ప్రాజెక్ట్ మొదలెట్టినప్పటి నుండే ఈ సినిమా పబ్లిసిటీని ఇరగదీయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇక దర్శకుడు సుందర్ సి, మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ మధ్యన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయని.... అందులో భాగంగా రెహ్మాన్ తో రెండుమూడు రకాల థీమ్స్ కంపోజ్ చేయించాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇక రెహ్మాన్ కంపోజ్ చేసిన ఆ థీమ్ మ్యూజిక్ ను ముందుగానే విడుదల చేసి సంఘమిత్ర పై ఫుల్  హైప్ తీసుకురావాలనేది వారి ప్లాన్.

ముందుగా కేన్స్ ఫెస్టివల్ లో ఈ సినిమా హీరోలు ఆర్య, జయం రవి, శృతిహాసన్ ఫొటోలను ఉపయోగించి గ్రాఫిక్స్ చేశారు. మరి శృతి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో దిశాపటానీతో మళ్లీ గ్రాఫిక్స్ చేయించి.... దానికి రెహ్మాన్ థీమ్ మ్యూజిక్ ను కలపబోతున్నారు. ఆ తర్వాత సినిమా సెట్స్ మీదకెళ్లేటప్పుడు ఆ గ్రాఫిక్ ని జోడించిన థీమ్ మ్యూజిక్ ని విడుదల చెయ్యబోతున్నారు. ఇక 'సంఘమిత్ర' అతిత్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతుందనే సమాచారం అందుతుంది.

Sponsored links

Sangamitra Movie Shooting Updates:

Sangamitra Team targets Baahubali

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019