Advertisement

చిన్న గాయమే- పవన్ ఫ్యాన్స్ డోంట్ వర్రీ!

Mon 23rd Oct 2017 09:14 PM
pawan kalyan,pspk25,injured,shooing  చిన్న గాయమే- పవన్ ఫ్యాన్స్ డోంట్ వర్రీ!
Small Injury to Pawan Kalyan at PSPK25 Shooting చిన్న గాయమే- పవన్ ఫ్యాన్స్ డోంట్ వర్రీ!
Advertisement

పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో PSPK 25  చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ సినిమా మంగుళూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక అక్కడినుండి హైదరాబాద్ వచ్చి.... యూరప్ షెడ్యూల్  కి వెళ్లనుంది టీమ్. యూరప్ లోలాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసిన చిత్ర బృందం అక్కడ పవన్, కీర్తి, అను ల మీద పాటల చిత్రీకరణ జరపనుంది. అయితే మంగుళూరు లో ప్రస్తుతం యాక్షన్ సన్నివేశలను చిత్రీకరిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ చేతికి దెబ్బతగిలినట్లుగా రెండు రోజుల క్రితం వార్తలొచ్చాయి.

అయితే ఆ గాయం వలన ఇబ్బందేం లేదని.. ఆ దెబ్బని లెక్కచెయ్యకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు పవన్. అయితే ఆదెబ్బ తర్వాత పవన్ చేతికి  మరో చిన్నపాటి గాయమైనందని... అయితే ఆ గాయం వలన కూడా పెద్దగా ప్రమాదం లేదని.. అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అలాగే ఆ చిన్నపాటి గాయంతోనే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడని... ఈ చిత్ర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోందని ఈ చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

మరి పవన్ కళ్యాణ్ ఎటువంటి గాయాలను లెక్కచెయ్యకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేసి తన రాజకీయ పనులను చక్కబెట్టుకోవాలని చూడడమే కాకుండా... ఈ సినిమాని ఎలాగైనా జనవరి 10న విడుదల చెయ్యడానికి తన ద్వారా ఎటువంటి అడ్డంకులు లేకుండా కృషి చేస్తున్నట్లుగా అర్ధమవుతుంది.

Small Injury to Pawan Kalyan at PSPK25 Shooting:

Pawan Kalyan INJURED At Agnathavasi movie Shooting 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement